బ్రహ్మానందం జీవితంలో త్రిమూర్తులు

హాస్యానికి ఆలంకారం బ్రహ్మానందం. వందల అవార్డులు, వేల సినిమాలు, కోట్ల నవ్వులు.. ఇదీ ఆయన ట్రాక్ రికార్డ్. లెక్చరర్ గా జీవితం మొదలుపెట్టి ఆయన.. తెలుగు సినిమా హాస్యానికి డీన్ గా మారిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే ఎంత ప్రతిభ వున్నా ఆ ప్రతిభని వెలికితెచ్చె ఓ ప్రోత్సాహం కావాలి. అలాంటి ప్రోత్సాహం త్రిమూర్తులు రూపంలో బ్రహ్మనందం కు దొరికింది.

బ్రహ్మానందంకు కెరీర్ కు మలుపునిచ్చిన చిత్రం ‘అహనా పెళ్లంట’. ఈ చిత్రంలోకి ఆయన రావడం నిజంగా మ్యాజిక్ అనాలి. ‘అహనా పెళ్లంట’లో కోట శ్రీనివాసరావు పాత్రకు అసిస్టెంట్‌ గా మొదట సుత్తివేలుని అనుకున్నారు. ఆ రోజుల్లో సుత్తివేలు చాలా బిజీ. ఇందులో ఆయన చేయడం కుదరలేదు. దీంతో చిత్ర నిర్మాత రామానాయుడు అప్పటికే ‘సత్యాగ్రహం’ చిత్రంలో బ్రహ్మానందం నటన అప్పటికే చూసి వున్నారు. అలా బ్రహ్మానందం పేరుని సూచించడం, అరగుండు పాత్రకు అద్భుతమైన ఆదరణ లభించడం, అన్నిటికంటే ముఖ్యంగా దర్శకుడు జంధ్యాలతో పరిచయం ఏర్పడటం బ్రహ్మానందం సినీ ప్రయాణంలో మర్చిపోలేని అధ్యాయం. తర్వాత దాదాపు జంధ్యాల చేసిన అన్ని చిత్రాల్లో అలరించారు బ్రహ్మానందం.

బ్రహ్మానందం ప్రయాణంలో మరో అద్భుతం..చిరంజీవితో పరిచయం. ‘చంటబ్బాయ్‌’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో స్వయంగా జంధ్యాల చిరంజీవితో పరిచయం చేయించారు. బ్రహ్మానందం మిమిక్రీ, కామెడీ టైమింగ్ కి ఆశ్చర్యపోయిన చిరు.. ‘మద్రాసు రండి. మీరు ఎలా సినిమాల్లో నటించాలో నేను చూసుకుంటా’అని మాటిచ్చారు చిరు. తర్వాత వారి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా రామానాయుడు, జంధ్యాల, చిరంజీవి .. బ్రహ్మానందం కెరీర్ లో త్రిమూర్తులు పాత్రని పోషించారు.

బ్రహ్మి- చిరు.. వెరీ ఫన్నీ

బ్రహ్మానందం, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. అన్ స్క్రీన్ మాత్రమే కాదు… అఫ్ స్క్రీన్ కూడా వీరి మధ్య మంచి బాండింగ్ వుంది. బ్రహ్మానందం, చిరంజీవి ప్రాక్టికల్ జోక్స్ గురించి ప్రత్యేకంగా చెబుతుంటారు. బ్రహ్మి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది చిరంజీవితోనే. ‘ఎయిర్ హోస్టెస్ కాళ్లుకు మొక్కాలి. వాళ్ళు బ్లెసింగ్స్ ఇస్తారు’ అని చిరు చెప్పడం, నిజంగానే ఆయన మొక్కడం దెబ్బకి ఎయిర్ హోస్టెస్ కంగారు పడిపోవడం.. ఆ సన్నివేశం గుర్తొచ్చినప్పుడల్లా తెగ నవ్వుతుంటారట చిరు. ఒక దశలో చిరంజీవి సినిమాలో బ్రహ్మి పాత్ర వుండటం ఆనవాయితీ అయ్యింది. ఆయన పాత్ర లేకపోయినా.. ఫారిన్ షూటింగ్స్ కి వెళ్ళేటప్పుడు బ్రహ్మిని వెంటతీసుకొని వెళ్ళిపోయేవారు చిరు. అలా పుట్టిన పాత్రలు, సన్నివేశాలు కూడా చాలా వున్నాయి. ఫారిన్ టూర్ లో బ్రహ్మితో ఓ రేంజ్ లో ప్రాక్టికల్ జోక్స్ వేసేవారట చిరు. హోటల్ ని చెక్ అవుట్ చేసేటప్పుడు బ్రహ్మి లగేజ్ లో అక్కడి స్పూన్ లు, గ్లాస్ దాచేయడం, చెకింగ్ దగ్గర స్వయంగా సెక్యురిటీకి పట్టించేయడం.. తర్వాత మెల్లగా వచ్చి అసలు విషయం చెప్పడం.. అలా చాలా సరదా సరదాగా గడిచిపోయేది.

నిజంగా బ్రహ్మానందం జీవితంలో రామానాయుడు, జంధ్యాల, చిరంజీవి లది త్రిమూర్తల పాత్రే. జంధ్యాల హాస్య చక్రవర్తిగా ప్రేక్షకులకు గుర్తుండిపొతే.. మూవీ మొఘల్ రామానాయడు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ తో గౌరవించబడ్డారు. మెగాస్టార్ ఇప్పుడు పద్మవిభూషణ్ అయ్యారు. బ్రహ్మానందం కిరీటంలో పద్మశ్రీ చేరింది. లెజెండరీ ప్రయాణం అంటే ఇదేనేమో

(ఈరోజు బ్రహ్మానందం పుట్టినరోజు)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close