ఆత్మ‌క‌థ రాస్తున్న బ్ర‌హ్మానందం

అరగుండుగా `అహ‌నా పెళ్లంట‌`లో న‌వ్వించాడు బ్ర‌హ్మానందం. అది మొద‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంద‌లాది చిత్రాల్లో హాస్య పాత్ర‌లు పోషించి, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ‌తో ప్ర‌భుత్వం బ్ర‌హ్మీని సత్క‌రించింది. గిన్నిస్ బుక్‌లోనూ స్థానం ద‌క్కింది. గ‌త కొంత‌కాలంగా.. బ్ర‌హ్మీ కి సినిమాలు బాగా త‌గ్గాయి. ఇంటి ప‌ట్టునే ఉంటూ, పిల్ల‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. అప్పుడ‌ప్పుడూ బొమ్మ‌లు వేస్తూ – త‌న‌లోని మ‌రో కోణాన్ని త‌న అభిమానుల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇప్పుడు బ్ర‌హ్మానందం ఆత్మ‌క‌థ రాస్తున్నార్ట‌.

బ్ర‌హ్మానందం త‌న జీవితంలోని అన్ని ముఖ్య ఘ‌ట్టాల‌ను.. ఛాయా చిత్రాల‌తో స‌హా, ఈ పుస్త‌కంలో పంచుకోబోతున్నారు. బ్ర‌హ్మానందం స్వ‌త‌హాగా సాహిత్యాభిలాషి. తెలుగు లెక్చ‌ల‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అందుకే… త‌న పుస్త‌కాన్ని త‌న స్వ‌హ‌స్తాల‌తో రాస్తున్నార‌ని వినికిడి. ఈ యేడాదే ఈ పుస్త‌కాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. తాను వేసిన బొమ్మ‌ల‌తో ఓ ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేసే ఆలోచ‌న కూడా ఉంది. మొత్తానికి ఈ ఖాళీ స‌మ‌యాన్ని బ్ర‌హ్మానందం బాగానే ఉప‌యోగించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

టీడీపీ నుంచి పురందేశ్వరికి సపోర్ట్..!

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ప్రశంసలు కన్నా ఏపీలో ఎక్కువగా విమర్శలే వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన నేతలు పెద్దగా అభినందించినట్లుగా కనిపించలేదు కానీ...

పారితోషికాల త‌గ్గింపు.. పెద్ద జోక్‌

ఇండ్ర‌స్ట్రీలో ఎప్పుడూ ఓ మాట వినిపిస్తుంటుంది. ''బ‌డా స్టార్లు పారితోషికాలు త‌గ్గించుకోవాలి..'' అని. త‌రాలు మారినా, ప‌రిస్థితులు మారినా.. ఈ మాట మాత్రం మార‌లేదు. హీరోలు పారితోషికాలు త‌గ్గించుకోలేదు.. నిర్మాత‌లు త‌గ్గించి ఇచ్చిన...

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

HOT NEWS

[X] Close
[X] Close