రామ్‌చ‌ర‌ణ్.. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌..?

ధృవ‌లో రామ్‌చ‌ర‌ణ్ మేకోవ‌ర్ అదిరిపోయింది. స్టైలింగ్‌, గెట‌ప్‌… వీటిలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం అంత‌కంటే ఎక్కువే క‌ష్ట‌ప‌డుతున్నాడు చెర్రీ. ఈ సినిమా కోసం ఇది వ‌ర‌కు లేనంతగా గడ్డం పెంచాడు. బరువు త‌గ్గాడు. సుక్కు సినిమాలో చ‌ర‌ణ్ చెవిటివాడిగా క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఆ ర‌కంగానూ ఇది ప్ర‌యోగాత్మ‌క పాత్రే. పైగా.. 20 ఏళ్ల క్రితం క‌థ ఇది. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని పునః సృష్టి చేస్తోంది చిత్ర‌బృందం. మాట తీరు, బాడీ లాంగ్వేజ్ కూడా ఆ కాలానికి త‌గ్గ‌ట్టే ఉండాలి క‌దా? అందుకే చ‌ర‌ణ్ ప్ర‌త్యేక క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.

అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే ఈ సినిమాలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ గ‌ట్టిగా ద‌ట్టించార్ట‌. చ‌ర‌ణ్‌కి సోద‌రులుగా ఆది పినిశెట్టి, వైభ‌వ్‌లు క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం ప‌ల్లెటూరి ప్రేమ‌లు, రేప‌ల్లె లాంటి టైటిళ్లు వినిపించాయి. ఆఖరికి రేప‌ల్లె టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి రాజ‌మండ్రిలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించ‌నున్నారు. స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com