కవితను సస్పెండ్ చేసిన తరవాత బీఆర్ఎస్ వ్యూహకర్తలు ఆమెను ఇక మోరల్‌గా దెబ్బకొట్టాలని డిసైడయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కవితపై తీవ్రమైన ఆరోపణలతో వ్యతిరేక పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక బయట కూడా తెలంగాణ జాగృతిలో చీలిక అంటూ కొత్త రాజకీయం ప్రారంభించారు. పాత జాగృతి లీడర్లతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయించి..కవితక్క మమ్మల్ని రోడ్డు మీద పడేసిందని చెప్పించారు. కవితపై చాలా ఆరోపణలు చేశారు. ఇదే సందు అని.. బీఆర్ఎస్ మీడియా జాగృతి కవితది కాదని.. జాగృతి చీలిపోయిందని ప్రచారం చేయడం ప్రారంభించారు.
తెలంగాణ జాగృతిని కవిత చాలా కాలం నుంచి నిర్మించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన వారు ఎవరూ ఇప్పుడు జాగృతిలో లేరు. కవిత వెంట తిరగడం లేదు. వారి బీఆర్ఎస్ లో నామినేటెడ్ పోస్టులు కూడా పొందారు. ఇప్పుడు కవితపై విమర్శలు చేస్తున్నారు. కవిత సొంతంగా క్యాడర్ ను తయారు చేసుకుంటున్నారు . యువనేతలకు శిక్షణ కూడా ఇచ్చారు. పాత నేతలు ఉన్నా లేకపోయినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.
కవిత ఇప్పటికీ తాను జాగృతి పేరుతో రాజకీయం చేస్తానని ప్రకటించడం లేదు. తన తదుపరి కార్యాచరణను రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఆమె ఖచ్చితంగా ప్రత్యేక పార్టీ పెట్టుకుటుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ ఆమెను ముందుగానే బలహీనం చేసే ప్రయత్నంలో పడింది. కానీ కవిత.. తనపై ఎలాంటి దాడి జరుగుతుందో తెలుసు కాబట్టి సన్నద్ధమయ్యే ఉన్నారని జాగృతిలో యాక్టివ్ గా ఉన్నవారు చెబుతున్నారు.


