అధికారికంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో బీఆర్ఎస్ పార్టీ .. బీసీ రాజకీయాలతో ముప్పేట దాడి చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బీసీ నాయకులందర్నీ రంగంలోకి దింపుతోంది. బీఆర్ఎస్ బీసీస నేతలుతెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. బీసీలకిచ్చిన హామీలు,వాటిని నెరవేర్చకుండా చేసిన కుట్రలు, కొనసాగుతున్న కుతంత్రాలు,42% రిజర్వేషన్స్ అమలుపర్చకుండా చేస్తున్న మోసం చేస్తున్నారని అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఉన్న వివరాలను గ్రామాలకు వెళ్లి చెప్పాలని నిర్ణయించారు.
మరో వైపు పార్టీకి సానుభూతిపరులైన వారితో ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేయించి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సినీ దర్శకుడు ఎన్ శంకర్ , ఆర్ కృష్ణయ్యలు ఈ సమావేశాలను లీడ్ చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో 42 శాతం చట్ట పరంగా రిజర్వేషన్ లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని ఈ కుల సంఘ నేతలు డిమాండ్ చేశారు. కుట్రలు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నాయని .. మన బలహీనత వారికి బలం అయింది..దర్శకుడు ఎన్ శంకర్ ఆవేశపడ్డారు. బీసీ లు అంటే బలహీనులు కాదు.. బీసీలంటే బలం..రేపు ప్రతి కుటుంబం నుండి ఒక నామినేషన్ వేయాలని పిలుపునిచ్చారు. 3 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్..3000 కోట్ల బడ్జెట్ కోసం ఎన్నికలు పెడతారా అని మండిపడ్డారు. ఈ ప్రసంగాలు
అటు పార్టీ.. ఇటు సానుభూతిపరుల సమాంతర నిరసనలతో పాటు.. బీఆర్ఎస్ విషయాన్ని పార్లమెంట్ కు చేర్చాలని నిర్ణయించుకుంది. రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీకి రాజ్యసభలో మాత్రమే సభ్యులు ఉన్నారు. అందుకే రాజ్యసభలో బిల్లు పెడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడాన్ని హైలెట్ చేసి.. కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని చెప్పి.. ఓడించాలని ప్రయత్నిస్తున్నారు.