అధికారంలో ఉన్నప్పుడు సర్వం కేటీఆర్ – ఇప్పుడు హరీష్ !

బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాతి లీడర్ కేటీఆర్. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ అనధికారిక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన విధులు నిర్వహించారు.ప్రతీ దానికి ఆయనే ముందు ఉండేవారు. సీఎం చైర్లో కూర్చోలేదు గానీ, అన్ని డిపార్ట్మెంట్లనూ ఆయనే ఓ సీఎం గానే హ్యాండిల్ చేశారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో మాత్రం ప్రతీ దానికి హరీష్ రావు ముందుకు వస్తున్నారు. కేటీఆర్ వెనక్కి వెళ్లిపోతున్నారు.

పార్టీ ఫ్లోర్లీడర్గా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు హాజరు కాలేదు. దీంతో హరీష్ రావు లీడ్ తీసుకున్నారు. బీఏసీ సమావేశానికి కూడా ఆయనే వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పేరు ఇవ్వకపోవడంతో అంగీకరించలేదు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ ముందుకు వస్తారేమోనని అుకున్నారు. సెషన్ మొత్తంలో అప్పుడప్పుడు తప్ప ప్రేక్షక పాత్రకే ఆయన పరిమితమయ్యారు. సైలెంట్గా ఉండిపోయారు. ప్రభుత్వం వైపు జరిగిన దాడిన హ రీష్ రావే ఎదుర్కొన్నారు.

బడ్జెట్ సెషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్పేపర్ హాట్ టాపిక్గా మారింది. ఇరిగేషన్ తప్పులపై సభ్యులు ప్రశ్నిస్తున్న ప్రతిసారి హరీశ్రావు కార్నర్ అయ్యారు. అసెంబ్లీలో నిరసన తెలపాలన్న.. పోడియం వద్దకు వెళ్లాలన్నా.. హరీశ్రావే ముందుకు రావాల్సి వచ్చింది. వాకౌట్ విషయంలోనూ ఆయన లీడ్లోనే పార్టీ నేతలు నడిచారు. హరీష్ ను కావాలనే ముందుకు తోస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్స్లో ఆయా నియోజకవర్గాలకు హరీశ్ రావునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్చార్జ్గా నియమించారు. ఆయా ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే హరీశ్రావుకు ఆ బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం కేటీఆర్కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగిన బీఆర్ఎస్.. గెలుస్తామని నమ్మకంతో కేటీఆర్ కు క్రెడిట్ ఇచ్చారు. హరీష్ పై బీఆర్ఎస్ లో తెలియని రాజకీయం నడుస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష్ణు క‌న్న‌ప్ప వెనుక కృష్ణంరాజు

రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'క‌న్న‌ప్ప‌'. త‌న సొంత బ్యాన‌ర్‌లో బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం కృష్ణంరాజుకు న‌టుడిగా, నిర్మాత‌గా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని ప్ర‌భాస్‌తో...

తీహార్‌ జైల్లో కవితను కలిసిన కేటీఆర్

తీహార్ జైల్లో ఉన్న కవితతో చాలా రోజుల తర్వాత కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆమె కోసం...

సజ్జల ప్లేస్‌లో ఉండవల్లి కరెక్ట్ !

అబ్బా..అబ్బా.. ఏం మోటివేషన్ అండి. ఆయన గారు కార్పొరేట్ మోటివేషనల్ స్పీకర్ గా వెళ్తే ఆయన ఎక్కించే హైప్‌కి ఐటీ ఉద్యోగులు గాల్లో తేలిపోతారు. కానీ జగన్ రెడ్డికి ఎలా ఉందో ...

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close