ఏపీ లిక్కర్ స్కాంలో కీలకంగా మారిన వెంకటేష్ నాయుడు కు సంబంధించిన వివరాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి తరపున ప్రతినిధిగా వ్యవహరించి నోట్ల కట్టల డెన్ ల వ్యవహారాలన్నీ చూసినట్లుగా ఆరోపణలు ఉన్న వెంకటేష్ నాయుడు బీఆర్ఎస్ పార్టీ వారసులు కవిత, కేటీఆర్కు కూడా బాగా పరిచయస్తుడన్న దానికి ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
వెంకటేష్ నాయుడు కేటీఆర్ పుట్టిన రోజున హిందూ పత్రికలో ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. ఆయన ప్రకటన ఇప్పుడు వైరల్ అయింది. సాధారణంగా హిందూ పత్రికలో ఫుల్ పేజీ ప్రకటన ఇవ్వాలంటే పారిశ్రామిక వేత్తలే అయి ఉండాలి. వ్యక్తులు అలా ఇవ్వలేరు. కానీ వెంకటేష్ నాయుడు ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. అలాగే కవితతో ఫోటోలు కూడా దిగారు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా తెలంగాణలో మకాం వేసి.. డబ్బుల పంపిణీ వ్యవహారాలను చూశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే సర్వే ఏజెన్సీని పెట్టుకుని ఎప్పటికప్పుడు సర్వేలు ఇస్తూ.. దానికి తగ్గట్లుగా డబ్బులు కూడా తరలించేవారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ డబ్బుల పంపిణీలో పెద్దిరెడ్డి పేరు కూడా వినిపించింది. తుడా నిధులు ఈ ఎలక్షన్ సర్వే సంస్థకు చెవిరెడ్డి ఇచ్చారని విజిలెన్స్ కూడా తేల్చినట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది.
వెంకటేష్ నాయుడి వ్యవహారాలపై లోతుగా ఆరా తీస్తే.. తెలంగాణలో జరిగిన విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నాయి. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి ఇంకెన్ని రహస్యాలు వెలికి తీస్తారో కానీ సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.