తెలంగాణ… బీఆర్ఎస్ జాగీరా అంటూ ” ఏబీఎన్ ఆర్కే రాసిన ఆర్టికల్ బీఆర్ఎస్ కు కోపాన్ని తెప్పించింది. తెలంగాణలో ఛానెల్ కార్యకలాపాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ వ్యతిరేక కథనం రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎబీఎన్ ఛానెల్ పై దాడికి పాల్పడుతామని బీఆర్ఎస్ హెచ్చరికలతో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది. ఈ వివాదంపై చర్చ కొనసాగుతుండగా … ఇందులోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం మరో టర్న్ తీసుకున్నట్టు అయింది. బండి సంజయ్ పూర్తిగా ఏబీఎన్ టర్న్ తీసుకున్నారు. ఆ ఛానెల్ పై దాడికి పాల్పడిన రెండు గంటల్లో బీఆర్ఎస్ భవన్ పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామని సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఓ ఛానెల్ కొనసాగుతున్నా దాన్ని ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మహ న్యూస్ పై బీఆర్ఎస్వీ కార్యకర్తల దాడి తర్వాత కేటీఆర్ రియాక్షన్, జగదీశ్వర్ రెడ్డి రెచ్చగొట్టే కామెంట్స్ అందర్నీ విస్మయానికి గురి చేశాయి. “మేము మహా న్యూస్ పై చేసింది దాడి కాదు.. నిరసన మాత్రమే” అంటూ జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడం.. దాడులను ప్రేరెపించేలా ఉందన్న వాదనలు వినిపించాయి. ఇలా ఈ వేడి కొనసాగుతుండగా.. ఆంధ్రా మీడియా , తెలంగాణ మీడియా అంటూ మళ్లీ సెంటిమెంట్ రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఏబీఎన్ ఆర్కే ఆర్టికల్ సంచలనం సృష్టించింది. దీంతో ఏబీఎన్ పై దాడులు చేస్తామని బెదిరింపులతో .. బీఆర్ఎస్ పూర్తిగా మీడియా అటెన్షన్ కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఎందుకంటే..ఇప్పటికే బీఆర్ఎస్ ను మెయిన్ స్ట్రీం మీడియా పెద్దగా ఫోకస్ చేయడం లేదని.. సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఇలాంటి సమయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో వైరం బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం. మీడియా అధినేతలు ఎవరైనా , ప్రాంతీయ భావం లేకుండా హైదరాబాద్ లో మీడియా సంస్థలను నిర్వహిస్తున్నారు. వాటిలో తెలంగాణ వారే అధికంగా ఉన్నారు. కానీ, రాజకీయాల కోసం ఆంధ్రా మీడియా అంటూ రచ్చకెక్కితే ఏ ప్రధాన స్రవంతి మీడియా బీఆర్ఎస్ ను పెద్దగా పట్టించుకోదు. అందుకే ఆ ఛానెల్ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్ పై దృష్టిసారిస్తోంది. ఇలాంటి సమయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో వైరం ఆ పార్టీకే ఎక్కువ నష్టం వాటిల్లేలా చేస్తుందనేది ఓపెన్ సీక్రెట్. అందుకే బండి సంజయ్ ఈ విషయంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీఆర్ఎస్ ఏదైనా సాధించిందా అంటే ఏమి లేదు..
పైగా.. మిగతా చానెల్స్ ను భవిష్యత్ లో కేటీఆర్ ప్రాంతీయతత్త్వంతో చూడరనే గ్యారంటీ ఏంటి అని ఫీల్ అవుతే.. అది బీఆర్ఎస్ కు మరింత మైనస్ అవుతుంది. ఇది మంత్రులుగా పని చేసిన కేటీఆర్ , జగదీశ్వర్ రెడ్డికి తెలియనివి కావు. అయినా వైరం పెట్టుకున్నారంటే సెంటిమెంట్ కోసమే. నాడు శ్రీకృష్ణ కమిటీ నివేదికను చదివితే .. తెలంగాణ కోసం ఎబీఎన్ ఏం చేసిందో తెలుస్తుంది అంటూ చురకలు అంటించేశారు ఆర్కే. దీంతో బీఆర్ఎస్ కు ఆ పార్టీ శ్రేణుల నుంచి తప్ప తెలంగాణవాదుల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడం గమనార్హం.