రివ్యూ: బబ్లీ బౌన్సర్

Bubli Bouncer Movie Telugu Review

తమన్నా ఒకప్పుడు అగ్ర కథానాయిక. దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. తర్వాత లేడి ఓరియెంటెడ్ సినిమాల వైపూ అడుగులేసింది. అటు బాలీవుడ్ చిత్రాల్లోనూ మెరిసింది. ఫాషన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు మధుర్‌ భండార్కర్‌. క్యాలెండర్ గర్ల్స్, హీరోయిన్, ఇందు సర్కార్.. ఇలా ఆయన చిత్రాలు దాదాపు మహిళా ప్రాధాన్యత వున్నవే. ఇప్పుడు తమన్నా ప్రధాన పాత్రలో బబ్లీ బౌన్సర్ ని తెరకెక్కించాడు. దీంతో బబ్లి బౌన్సర్ పై ఒక ఆసక్తి ఏర్పడింది. డిస్నీ హట్ స్టార్ వేదిక ఈ సినిమా విడుదలైయింది. చాలా కాలం తర్వాత తమన్నా చేసిన ఈ లేడి ఓరియంటెడ్ చిత్రం ఎలా వుంది ? లేడి బౌన్సర్ పాత్రలో తమన్నా ఎంతలా ఆకట్టుకుంది ?

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో వుండే అసోల, ఫతేపూర్ బేరి ఈ రెండు గ్రామాలు బౌన్సర్స్ కి కేరాఫ్ అడ్రస్ లాంటివి. ఈ గ్రామంలో యువకులందరికీ ఒకటే లక్ష్యం. జీవితంలో స్థిరపడాలంటే బౌన్సర్ లాంటి బాడీ పెంచాలి, ఢిల్లీలో బౌన్సర్ గా జాబ్ సంపాయించాలి. అదే గ్రామనికి చెందిన యువతి బబ్లీ తన్వర్ (తమన్నా భాటియా). బబ్లికి చదువు ఒంటపట్టదు. టెన్త్ ఐదుసార్లు తప్పి ఇంట్లో సుష్టుగా తిని కూర్చుటుంది. బబ్లి తండ్రి బౌన్సర్స్ కి శిక్షణ ఇస్తుంటాడు. బబ్లికి కూడా మంచి కండబలం వుంటుంది. అదే గ్రామానికి చెందిన విరాజ్ (అభిషేక్ బజాజ్ ) ఇంగ్లాండ్ లో చదువు పూర్తి చేసుకొని ఢిల్లీలో మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. ఒక వేడుకలో విరాజ్ ని చూసిన బబ్లి అతన్ని ఇష్టపడుతుంది. బబ్లి పెళ్ళీడుకి రావడంతో ఇంట్లో సంబంధాలు చూస్తారు. అయితే బబ్లికి ఢిల్లీలో ఉద్యోగం సంపాయించాలి, విరాజ్ ని కలవాలని ఆశపడుతుంది. పెళ్లి చూపులన్నీ తనే స్వయంగా చెడగొడుతుంది. అదే గ్రామానికి చెందిన కుక్కు (శైల్ వేద్) ఢిల్లీలోని ఒక పబ్ లో బౌన్సర్ గా పని చేస్తుంటాడు. బబ్లి అంటే కుక్కుకి ఇష్టం. ఈ సంగతి తన ఫ్యామిలీకి చెప్పి పెళ్లి చూపులకి వస్తాడు. కుక్కు.. బబ్లి ఫ్యామిలీకి నచ్చుతాడు. అయితే బబ్లి ఒక కండీషన్ పెడుతుంది. తను ఢిల్లీలో ఒక ఏడాది పని చేసిన తర్వాతే పెళ్లి అనేది బబ్లి కండీషన్. ఈ కండీషన్ కి కుక్కు , ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. తను పనిచేసే పబ్బులోనే ఒక లేడీ బౌన్సర్ ఉద్యోగం ఇప్పిస్తాడు కుక్కు. ఢిల్లీ వెళ్లిన బబ్లికి పబ్బులో ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయి ? విరాజ్, బబ్లి ప్రేమని అంగీకరిస్తాడా లేదా ? అనేది మిగతా కథ.

బాలీవుడ్ ఇప్పుడు ఎదుర్కుంటున్న పెద్ద సవాల్ నేటివిటీ. కథని నేచురల్ గా నేటివిటికి తగ్గట్టు ప్రజంట్ చేయడంలో తడబాటు కనిపిస్తోంది. సృజనాత్మకమైన కథలు అందించే బాలీవుడ్ లో ఇప్పుడు రీమేక్ సినిమాలు పెరగడానికి కారణం కూడా నేటివిటికి తగ్గ కథలు అక్కడ తయారుకాకపోవడమే. బబ్లి బౌన్సర్ కథకి కూడా ఈ నేటివిటి సమస్య వుంది. ఢిల్లీ సరిహద్దుల్లో వుండే మారుమూల గ్రామంలోని బబ్లి అనే అమ్మాయి కథ ఇది. టెన్త్ ఐదుసార్లు తప్పిన బబ్లి.. లేడి బౌన్సర్ గా చేరి.. తనకి ఎదురైన పరిస్థితులని ఎదుర్కొని.. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదగా బ్రేవ్ అవార్డ్ అందుకుంటుంది. వినడానికి లైన్ బావుంది. అయితే ఈ కథని ప్రజంట్ చేసిన విధానం మాత్రం చాలా కృత్రిమంగా వుంటుంది. ఇలాంటి కథలో ప్రధాన పాత్ర ఎమోషనల్ డ్రైవ్ చాలా ముఖ్యం. బబ్లి పాత్రని చూస్తున్నపుడు ఆమెని మనలో ఒకరిగా రిలేట్ చేసుకోవాలి. కానీ ఇందులో అలాంటి ఎమోషనల్ కనెక్షన్ వుండదు.

బబ్లి ప్రయాణంలో మహిళా సాధికారత, లింగ వివక్ష అంశాలు పైపైనే చర్చించాడు దర్శకుడు. పోనీ ఆ రెండు అంశాలైన బలంగా చెప్పివుంటే ఫలితం మరోలా వుండేది. చివర్లో ముఖ్యమంత్రి చేతుల మీదగా అవార్డ్ తీసుకున్నపుడు బబ్లి ఎదో సాధించిదనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలగాలి. కానీ చాలా యాక్సిడెంటల్ గా ఆ సీక్వెన్స్ లని ప్రజంట్ చేయడం ఆకట్టుకోదు. మధుర్‌ భండార్కర్‌ సంచలన దర్శకుడే. అయితే నేరుగా ఓటీటీకి ఒక సినిమా చేస్తున్నపుడు ఆయన నుండి మరింత బలమైన కంటెంట్ ఆశిస్తారు. కానీ బబ్లి బౌన్సర్ ని చాలా సాధారమైన కథ, కథనంతో ప్రజంట్ చేశాడు. విరాజ్, బబ్లిని రిజక్ట్ చేసినప్పుడు ఆమె దాన్ని పాజిటివ్ గా తీసుకొని మళ్ళీ చదవడం, తన విలువ పెంచుకునే ప్రయత్నం చేయడం ఓకే కానీ దాని కోసం రాసుకున్న లవ్ ట్రాక్ అంతా సాగదీత అనిపిస్తుంది. బబ్లి పాత్రతో ఒక స్ఫూర్తిని ఇవ్వలనుకున్నాడు దర్శకుడు. స్ఫూర్తిని ఇచ్చే కథలకు ఎమోషన్ చాలా ముఖ్యం. కానీ బబ్లి పాత్రలో ఎమోషన్ మిస్ అయ్యింది.

తమన్నాకు హుషారైన పాత్రలు చేయడం కొత్త కాదు. అయితే ఇందులో బౌన్సర్ నేపధ్యం యాడ్ అయ్యింది. అయితే బౌన్సర్ గా తమన్నా రెడీ అవ్వడం కానీ ఆ పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ చూపడం కానీ జరగదు. ఆ ఊర్లో అందరూ బౌన్సర్లే అంటూ తమన్నాకి కూడా బ్లాక్ డ్రెస్ వేసి నిలబెట్టినట్టు వుంటుంది. కుక్కు పాత్ర చేసిన శైల్ వేద్ పాత్ర బావుంటుంది. అలాగే విరాజ్ పాత్రలో చేసిన అభిషేక్ బజాజ్ నటన డీసెంట్ గా వుంటుంది. తమన్నా తండ్రిగా చేసిన శౌరభ్ శుక్లాతో పాటు మిగతా నటీనటులంతా పరిధిమేర చేశారు.

టెక్నికల్ గా బబ్లి బౌన్సర్ లో సినిమా స్టాండర్డ్స్ లోపించాయి. ఎంత వెబ్ మూవీ అయినా కనీసం సినిమాకి కావాల్సిన కెమెరాతో చిత్రీకరీంచాలి. కానీ బబ్లి బౌన్సర్ లో మాత్రం సీరియల్ కెమెరాని ఫీలౌతాం. డిఐ వర్క్ కూడా సరిగ్గా చేసినట్లు కనిపించదు. మ్యూజిక్ ఆకట్టుకోదు. డైలాగ్స్ లో ఎలాంటి మెరుపు వుండదు. చాలా పరిమితులతో తీసిన సినిమా ఇది. ఒక ఊరు, రెండు ఇల్లు, ఒక పబ్బు చుట్టూ సీన్లన్నీ చుట్టేసినట్లు వుంటుంది. తమన్నా సినిమా.. ఓటీటీలో వుంది.. అర్జెంట్ గా చూసేయాలనుకునే కంటెంట్ కాదిది. బాగా తీరిక వున్నపుడు మరో ఆప్షన్ లేకపోతే రిమోట్ క్లిక్ చేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close