నెలాఖరు వస్తే బుగ్గన క్యాంప్ ఢిల్లీలోనే..!

నెలాఖరు వచ్చే సరికి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి ఢిల్లీలో ఎక్కేగడప… దిగే గడప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గత నెలాఖరులో ఢిల్లీకి వెళ్లి… అప్పుల పరిమితిని పెంచుకోవడంలో సక్సెస్ అయిన బుగ్గన… ఆ నెల జీతభత్యాల గండాన్ని విజయవంతంగా అధిగమించారు. ఈ సారి పది రోజుల ముందుగానే…ఢిల్లీ చేరుకున్నారు. నీతి ఆయోగ్ సీఈవో సహా.. అందర్నీ కలిశారు. ఏపీ పరిస్థితి వివరించి నిధుల సాయం అడిగారు. మరోసారి ఢిల్లీకి వెళ్లి… కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కాబోతున్నారు. నిర్మలతో భేటీ వెనుక కీలక ఎజెండా ఉందన్న ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలపై కొంత సమాచారాన్ని కేంద్రం కోరినట్లుగా తెలుస్తోంది. పరిమితి దాటిన అప్పులు.. కేంద్రం ఇస్తున్న నిధులు మళ్లించడం వంటి అంశాలపై కేంద్రం వివరణ కోరినట్లుగా చెబుతున్నారు. ఈ వివరాలను.. బుగ్గన … ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇస్తారని చెబుతున్నారు. అదే సమయంలో పోలవరం అంచనాలను పూర్తిగా తగ్గించి… రూ. 20వేల కోట్లకే పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. అదే జరిగితే.. ఇక ప్రాజెక్ట్ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది.

అంటే.. ఇక ప్రాజెక్ట్ ముందుకు కదలకడం కష్టం. ఇప్పుడు ఎలాగైనా కేంద్రం నుంచి రూ. 47వేల కోట్లకు ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే.. ఇబ్బందుల్లో పడతారు. ఈ సమస్యలన్నింటినీ బుగ్గన అధిగమించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు అప్పులు తీసుకునేందుకు కేంద్రం సహకరిస్తోంది. కానీ నిధులు ఇవ్వడానికి మాత్రం అంగీకరించడం లేదు. మరి బుగ్గన ఈ సారైనా .. అప్పులు కాకుండా నిధులు సాధిస్తారేమో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close