మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎజెండా ఏమిటంటే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందట. ఇటీవల బేవరెజెస్ బాండ్ల మీద అప్పులు తెచ్చిందని అప్పట్లో వైసీపీ అప్పులు తేవాలనుకుంటే అప్పు కిక్కు అని ఆడిపోసుకున్నారని ఇప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించడానికి ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. మధ్యనిషేధం చేస్తామని చెప్పింది వారు కాబట్టి అందరూ అడిగారు. ఆ విషయాన్ని బుగ్గన మరచిపోతున్నారు.
అయినా బుగ్గన ఎందుకు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెడుతున్నారో వైసీపీ నేతలకూ అర్థంకావడం లేదు. శ్యామల లాంటి వారు హైదరాబాద్ లోనే ఉంటారు.కానీ టీడీపీపై విమర్శలు చేయడానికి ఆమె విజయవాడ వచ్చి పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెడతారు. ఎందుకంటే పార్టీ ఆఫీసులో పెడితేనే చేసే విమర్శలకు కాస్త వేయిటేజీ వస్తుంది. కానీ బుగ్గన మాత్రం హైదరాబాద్ నుంచి తాడేపల్లికి రావడం సమయం వృధా అనుకుంటున్నారు. సజ్జల ఆఫీసు నుంచి వచ్చే మెటీరియల్ ను.. హైదరాబాద్‌లోనే ప్రింట్లు తీసుకుని మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
ఇది ఒక్క సారే కాదు.. చాలా కాలం నుంచి బుగ్గన ఇదే చేస్తున్నారు. ఆయన వైసీపీ ఆఫీసుకు రానని ఒట్టేసుకున్నారా అన్న సైటైర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతగా ఉన్న ఆయన .. కాస్త లాజికల్ గా మాట్లాడతారు.కానీ ఆయన జగన్ ను ఎక్కడ డామినేట్ చేస్తారోనని పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఎప్పుడో ఓ సారి మాత్రం ఆర్థిక అంశాలపై మాట్లాడే అవకాశం ఇస్తారు. అప్పుడు ఆయన హైదరాబాద్‌లోనే ఆ పని పూర్తి చేస్తున్నారు.


