రియల్ఎస్టేట్ మార్కెట్ ను బిల్డర్లే నాశనం చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందరితో బలవంతంగా లగ్జరీ ఇళ్లను కొనిపించాలన్న లక్ష్యంతో అందుబాటు ధర ఇళ్లను కట్టడం మానేస్తున్నారు. ANAROCK రీసెర్చ్ డేటా ప్రకారం, 2019లో 38% ఉన్న అఫోర్డబుల్ హౌసింగ్ సేల్స్ షేర్ 2024లో 18%కు, 2025లో 16%కు పడిపోయింది. దీనికి కారణం.. బిల్డర్లు నిర్మించడం తగ్గించడమే.
అందుబాటు ధరల ఇళ్ల వల్ల పెద్దగా మార్జిన్ ఉండటం లేదని.. లగ్జరీ ఇళ్లతో ఎక్కు లాభం వస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అటు వైపే మొగ్గుచూపుతున్నారు. రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణాలుగా భూమి, కన్స్ట్రక్షన్ ఖర్చుల పెరుగుదలను చూపిస్తున్నారు. డెవలపర్లు తక్కువ మార్జిన్స్, కఠిన నిబంధనలు, ఇన్సెంటివ్స్ లోపం కారణంగా రూ. 1.5 కోట్లు పైన ఉన్న లగ్జరీ ప్రాజెక్టులకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అందుకే 2025 మొదటి అర్ధంలో అఫోర్డబుల్ ఇళ్ల నిర్మాణాల సంఖ్య 12%కు పడిపోయింది.
ఈ క్షీణత అన్ని నగరాల్లోనూ కనిపిస్తోంది. దీని వల్ల మధ్యతరగతి కుటుంబాలు కొనాలనుకునే ఇళ్లు తగ్గిపోయాయి. సప్లై-డిమాండ్ రేషియో పడిపోవడం ఆందోళనకరమని మార్కర్ ర్గాలు అంగీకరిస్తున్నాయి. అన్‌సోల్డ్ స్టాక్ తగ్గుదల డిమాండ్ పునరుద్ధరణ సూచన. కానీ, మిలియన్ల మధ్యతరగతి కుటుంబాలు రెంటల్స్‌పై ఆధారపడుతున్నాయి. డెవలపర్లు టెక్నాలజీ, PPP మోడల్స్ అడాప్ట్ చేసి సప్లై పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఎగువ మధ్యతరగతి కుటుంబాలకే సొంత ఇల్లు అనే ఆలోచనకు రావాల్సి వస్తుంది.

