రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు పాత ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సగం లావాదేవీలు పాత ఇళ్ల మీదనే జరుగుతున్నాయి. అపార్టుమెంట్లలో కూడా అవే ఎక్కువ. ఇండిపెండెంట్ హౌస్‌ల వరకూ వస్తే.. ఎంత పాతదన్నది పెద్దగా పట్టించుకోరు. కానీ అపార్టుమెంట్ విషయానికి వస్తే ఎంత పాతదన్నది ప్రామాణికం అవుతుంది. .
సాధారణంగా పదేళ్లు దాటిన పాత అపార్ట్మెంట్లు కొనడాన్ని చాలా మంది ఇష్టపడరు. అంత పాతదా అనుకుంటారు. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు 20 సంవత్సరాల కంటే ఎక్కువ పాత అపార్ట్మెంట్లకు రుణాలు ఇవ్వడానికి ఇష్టపడవు. అయితే పదేళ్ల కిందటి నుంచి నిర్మాణ టెక్నాలజీలో మార్పులు వచ్చాయి. అంతకు ముందు నిర్మించిన ఆపార్టుమెంట్లు నిర్మాణ సామర్థ్యం పై అనుమానాలు ఉండవచ్చు కానీ.. ఇటీవల కడుతున్న అపార్టుమెంట్ల లైఫ్ తక్కువేనని అంచనావేస్తున్నారు.
అపార్ట్మెంట్ నిర్వహణ బాగా ఉండి 40 సంవత్సరాల వయస్సు ఉన్నా కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ స్థిరత్వం, గోడలు, పైపింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్‌లు మొదలైనవి తనిఖీ చేయడం ముఖ్యం. స్ట్రక్చరల్ ఇంజనీర్‌ను సంప్రదించి భవనం యొక్క స్థితిని అంచనా వేసి ఆ తర్వాత కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. 30 సంవత్సరాలకు పైబడిన అపార్ట్మెంట్ల రీసేల్ విలువ తక్కువగా ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఉన్న పాత అపార్ట్మెంట్లు, మంచి నిర్వహణ ఉంటే, 30-40 సంవత్సరాల వయస్సు ఉన్నా విలువైనవిగా ఉండవచ్చు.