ఎన్ని ట్యాబ్ కాంట్రాక్టులు ఇచ్చినా కోలుకోలేనంతగా మునుగుతున్న బైజూస్ !

ఏపీ ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైన బైజూస్ కంపెనీ రోజు రోజుకు క్షీణించిపోతోంది. ఏం చేసినా కోలుకోలేకపోగా.. చివరికి తీసేసిన ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయమన్నా చేయలేకపోతున్నారు. చట్ట ప్రకారం తీసేసిన ఉద్యోగులకు.. మానేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదు. దీంతో వారు మీడియా, సోషల్ మడియాలకు ఎక్కి పరువు తీస్తున్నారు. కొంత మంది న్యాయపోరాటం చేస్తున్నారు. మరో వైపు తాజాగా ఈడీ రూ. 9వేల కోట్ల రూపాయలు మేర .. నగదు చెలామణిలో అవకతవకలకు పాల్పడినట్లుగా తేల్చి షోకాజు నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహాంలో కొన్ని వందల కోట్లు జరిమానా కట్టాల్సి రావొచ్చు. మరో వైపు అమెరికాలో తీసుకన్న రుణాలకు సంబంధించిన చెల్లింపుల గడువు తీరిపోయింది. కట్టాల్సినవి పేరుకుపోతున్నాయి. వేల కోట్లు నిధులు కంపెనీలోకి వచ్చి పడినా బయటపడటం కష్టంగా మారింది. ఓ వైపు బైజూస్ వ్యాపారం పూర్తి స్థాయిలోపడిపోయింది. ఆకాష్ గ్రూప్ కూడా బైజూస్ చేతిలోనుంచి జారిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ లాంటి ప్రభుత్వాలు అప్పనంగా ఇచ్చే సొమ్ముతో కాస్తైనా బయటపడవచ్చని అనుకుంటున్నారు. ఇటీవల ఈ అంశానికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు. బైజాస్ చివరికి దివాలాకు దగ్గరగా ఉందని కార్పొరేట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ సమయంలో పెరిగి.. వైరస్ తగ్గిపోయాక.. క్షీణించిన ఆన్ లైన్ సంస్థగా బైజూస్ మిగిలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close