బైజూస్ “జీరో”

నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలా విలువ కూడా చేయవని పనికి మాలిన వాళ్లను ఉద్దేశించి కొత మంది తిడుతూ ఉంటారు. ఇలాంటి తిట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీకి పిలిపించి ప్రజాధనం దోచి పెట్టిన బైజూస్‌కు కూడా వర్తిస్తుంది. అయితే బైజూస్ స్థాయి.. రూపాయి కాదు.. వేల కోట్లు. బైజూస్‌లో రూ.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ప్రోసస్‌ ఎన్‌వి నిండా మునిగినట్లు ప్రకటించింది. 2018లోని తమ పెట్టుబడులు ఇప్పుడు సున్నా విలువకు పడిపోయినట్లు తెలిపింది.

తాము బైజూస్‌లో పెట్టిన పెట్టుబడుల వాటాను రైటాఫ్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. బైజూస్‌ ఆర్థిక పరిస్థితులు, అప్పులు, భవిష్యత్‌ అంచనాలకు సంబంధించి తమవద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆ సంస్థ విలువను తాము సున్నాకు తగ్గిస్తున్నట్లు ప్రోసస్‌ తెలిపింది. తద్వారా తమకు 493 మిలియన్‌ డాలర్లు అంటే రూ.4వేల కోట్లుకుపైగా మేర నష్టం వాటిల్లినట్లు ఆ కంపెనీ నెదర్లాండ్స్ స్టాక్ మార్కెట్ కు తెలిపింది.

ఇది ఒక్కటే కాదు.. అసలు ఇప్పుడు బైజూస్ కంపెనీకి వాల్యూనే లేకుండా పోయింది. ఆదాయం లేకపోగా వేల కోట్లు అప్పులు ఉన్నాయి, అమెరికాలోనూ కేసులు ఉన్నాయి. అలా ఇన్వెస్ట్ మెంట్లు, అప్పులు ఏం చేశారో ఎవరికీ తెలియదు . ఈడీ విచారణలోనూ తేలడం లేదు. మొత్తంగా జగన్ రెడ్డి సర్కార్ తో ఒప్పందానికి వచ్చే వరకూ కాస్త పర్వాలేదనుకున్న కంపెనీ ఇప్పుడు జీరోకు చేరిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close