హారిక అండ్ హాసిని చినబాబుకి తప్ప బయట నిర్మాతలకు త్రివిక్రమ్ సినిమాలు చేయడం మానేసి మూడేళ్లు అవుతోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నుంచి వరుసబెట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని చినబాబు సినిమాలు నిర్మిస్తున్నారు. అలాగని, బయట నిర్మాతలు ఎవరూ త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లడం లేదని కాదు. వెళ్తున్నారు. అడ్వాన్సులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు మరికొందరి అడ్వాన్సులు త్రివిక్రమ్ దగ్గర వున్నాయి. ఆయన మాత్రం హారిక అండ్ హాసినికి స్టిక్ అయ్యారు. బట్ ఫర్ ఏ చేంజ్… త్వరలో బయట నిర్మాణ సంస్థకు త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు. ఆ ఛాన్స్ సి. కళ్యాణ్ కొట్టేశారు. నాని హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను సి. కళ్యాణే నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘అరవింద సమేత.. వీర రాఘవ’ చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్నమల్టీస్టారర్తో నాని బిజీ. ఎవరి సినిమా వారు పూర్తి చేశాక కొత్త సినిమా మొదలవుతుందా? మరి కొన్ని రోజులు టైమ్ పడుతుందా? అనేది తెలియాలి.