కాల్ మనీ సమస్య – పది వాస్తవాలు

కాల్ మనీ (సెక్స్ రాకెట్) పేరుతో సాగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారంలో దోషులుగా పేర్కొంటున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల పేర్లు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలవారిగా ఈ తరహా `దోషుల’ సంఖ్యాబలం ప్రకటించారు. ఆయనగారు చెప్పిన లెక్కలనుబట్టి వైఎస్సార్ సిపీ 65 మంది దోషులతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తెలుగుదేశం వాళ్లు 20 మంది, కాంగ్రెస్ వాళ్లు 12, సిపీఐ 6, సీపీఎం ఒక్కరు…ఇలా కాల్ మనీ కేసుల ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

ఆపార్టీ, ఈ పార్టీ అన్న తేడాలేకుండా సునామీలాగా అందర్నీ చుట్టుముడుతోంది ఈ కాల్ మనీ సెక్స్ కుంభకోణం వ్యవహారం. అక్రమ వడ్డీవ్యాపారానికి వ్యభిచారాన్ని కూడా ముడిపెట్టి సాగిస్తున్న ఈ అనైతిక దౌర్జన్య వ్యవహారం అసెంబ్లీ చర్చకు రావడం మంచిదే. ఎందుకంటే, ఈ దారుణాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిందే. రాష్ట్ర చట్టాల్లో లొసుగులు ఉండటం ఈ వైపరీత్యానికి ఒక కారణం. ఈ కాల్ మనీ సునామీ ఆగాలంటే ఇటు ప్రభుత్వం, అటు బ్యాంకింగ్ వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాల్సిందే. అదే జరగాలంటే అసెంబ్లీలో చర్చ అర్థవంతంగా సాగాలి. కనీసం ఈ దశగా తొలి అడుగు వేస్తున్నందుకు సంతోషించాలి.

అక్రమ వడ్డీ వ్యాపారం, కాల్ మనీ సెక్స్ పోకడల నేపథ్యంలో ఓ పది నిజాల గురించి చెప్పుకుందాం…

1. డబ్బు ఎంతపనైనా చేయిస్తుంది. ఈ కాల్ మనీ వ్యవహారంతో ఇది మరోసారి రుజువైంది. కాల్ మనీ సెక్స్ రాకెట్, వడ్డీ వ్యాపారం- ఈ రెండు వేరువేరు వ్యవహారాలే అయినప్పటికీ డబ్బు (మనీ) ఈరెంటినీ కలిపేసింది. దీంతో `కాల్ మనీ’ అనే కొత్త వికృతచేష్ట సంచలనం సృష్టిస్తోంది.

2. వడ్డీవ్యాపారుల్లో దిగజారుడు ధోరణి కాల్ మనీ వ్యవహారంతో బట్టబయలైంది. డబ్బు చెల్లించలేకపోతే వ్యభిచారం చేయాల్సిందిగా మహిళలపై ఒత్తిడి తీసుకురావడం ఒక కొత్తకోణం. అందుకే కాల్ మనీ సృష్టిస్తున్న ప్రకంపనలకు పాలకులు గడగడలాడాల్సి వస్తున్నది. ఒకవేళ ఇందులో వ్యభిచార కోణం లేకపోతే , అక్రమవడ్డీ వ్యాపరలావాదేవీలు ఇంతగా ప్రకంపనులు సృష్టించి ఉండేవికావు. ఎందుకంటే దశాబ్దాలుగా అక్రమ వడ్డీ వ్యాపారం సాగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవుకాబట్టి.

3. వడ్డీవ్యాపారంలో వ్యభిచారకోణం కనబడటంతో వ్యవహారం సీరియస్ గా మారింది. కాల్ మనీ కేసుల్లోంచి అక్రమ వడ్డీవ్యాపారుల కేసులను విడదీయడం కష్టంగామారింది. వడ్డీ వ్యాపారుల్లో కొంతమంది మాత్రమే కాల్ మనీ వ్యాపారం సాగిస్తున్నారనీ, మిగతా వాళ్లంతా మంచోళ్లని చెప్పడం కష్టం. పూర్తి లెక్కలు తేలాలంటే, ప్రభుత్వం ఈ విషయంపై ఓపెన్ గా వ్యవహరించాలి. డొంకంతా కదిలితేనేగానీ ఎంతమంది దోషులున్నారో తెలియదు.

4. అప్పులు తీసుకున్నవారు డబ్బులు సకాలంలో చెల్లించినప్పటికీ, వడ్డీ వ్యాపారులు ప్రామిసరీ నోట్లను, ఖాళీ చెక్కులను వాపసు ఇవ్వకుండా కొత్త షరతులు (వ్యభిచారం) పెట్టడం గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త చీకటి కోణం.

5. బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తే, మధ్యతరగతి, పేదలకు రుణాలు సులువుగా దొరుకుతాయి. అలా జరగకపోవడంవల్లనే అప్పుల కోసం వారు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్రమ వడ్డీవ్యాపారం జోరుగా సాగిపోతున్నది. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన అరిష్టంకాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రైవేట్ వడ్డీ వ్యాపారానికి బ్రేక్ పడుతుందనీ, బ్యాంకింగ్ వ్యవస్థ బాగా విస్తరించి, రుణ సదుపాయం అందరికీ అందేలా ప్రభుత్వాలు చూస్తాయన్న ప్రజలు అనుకున్నారు. కానీ వారి ఆశ అడియాసే అయింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు చేస్తున్న మోసాలను రాష్ట్ర చట్టాలు అరికట్టలేకపోతున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఈ వ్యవహారం రాష్ట్ర పరిధిలోనే ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థని మాత్రం కేంద్రం తన పరిధిలో ఉంచుకుంది. అటు కేంద్రం బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరించలేకపోవడం, ఇటు రాష్ట్రప్రభుత్వాలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల అక్రమాలను సరిగా అరికట్టలేక చతికిలపడటంతో సమస్య పెరిగిపోతూనేఉంది. చివరకు అసలు సమస్యకు వడ్డీలాగా `వ్యభిచార కోణం’ జమైంది.

6. కార్లు , గృహరుణాలు ఇవ్వడంలో బ్యాంకులు చూపిస్తున్న శ్రద్ద, మధ్య- పేద తరగతులవారికి రుణాలు ఇవ్వడంలో చూపడంలేదు.

7. బ్యాంకులను ఆశ్రయించి రుణాలు పొందాలంటే, అనేక డాక్యుమెంట్స్, పూచీకత్తులు ఉండాలి. మరెన్నో షరతులు, నిబంధనలు పాటించాల్సిఉంటుంది. దీంతో రుణగ్రహీత బ్యాంకులకంటే సులువుగా రుణం ఇచ్చే వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. బ్యాంకుల్లో రుణం మంజూరు కావాలంటే సమయం ఎక్కువ పడుతుందన్న అభిప్రాయం పేరుకుపోయింది. అందుకే అడిగిన వెంటనే రుణం అందించే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను చాలామంది ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగానే అనేక ఫైనాన్స్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలామటుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఫలితంగా ప్రైవేట్ వడ్డీవ్యాపారుల వలలో రుణగ్రహీతలు చిక్కుకుపోతున్నారు.

8. బ్యాంకులు సంపన్నలకు, సమాజంలో పేరుబడ్డ వారికి అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయడం, అదే సామాన్యులు అడిగితే వారిని ముప్పతిప్పలు పెట్టడం జరుగుతుండటం కూడా ప్రైవేట్ వడ్డీవ్యాపారం పుంజుకోవడానికి కారణమైంది. దీంతో వారు ఆడింది ఆట, పాడింది పాట. ఇదే చివరకు కాల్ మనీ పోకడకు దారితీసింది.

9. నిఘా లోపించడం, చట్టాల్లోని లొసుగులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థులకు పూలబాటలా మార్చింది. దీంతో ఫైనాన్స్ కంపెనీలను రాజకీయనాయకులు తెరవెనుక నుంచి నడిపించడం ప్రారంభించారు. అలాగే రౌడీలు, గూండాలు, పలునేరాల్లో సంబంధం ఉన్నవారు తాము అక్రమంగా సంపాదించిన డబ్బుని వడ్డీ వ్యాపారవేత్తలకు ఇస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వడ్డీ వ్యాపారం చుట్టూ ఎన్ని రకాల మోసాలు జరగాలో అన్నీ జరిగిపోతున్నాయి.

10. రుణం అడిగిన వారికి బ్యాంకులు వెంటనే సహకారం అందిస్తే, చాలామంది ప్రైవేట్ వడ్డీ వ్యాపార సంస్థలకు దూరంగా జరుగుతారు. సక్రమమైన డాక్యుమెంట్లు లేకపోయినా రుణాలు ఇస్తున్న వడ్డీ వ్యాపార సంస్థల ధోరణికి రాష్ట్రాలు కఠినచట్టాలతో అడ్డుకట్టవేయగలిగాలి. దీంతోపాటు కాల్ మనీ పేరిట వ్యాపిస్తున్న కొత్త జాఢ్యాన్ని నిరోధించగలగాలి. ఇదంతా జరగాలంటే, అటు కేంద్రం, బ్యాంకింగ్ వ్యవస్థను సరళీకృతం చేయాలి. అలాగే, ఇటు రాష్ట్రప్రభుత్వాలు చట్టంలో సవరణలు తీసుకురావాలి. అందుకే, అసెంబ్లీలో ఈ అంశం చర్చకు రావడం శుభపరిణామని చెప్పుకోవచ్చు. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా తలుచుకుంటే ఈ కాల్ మనీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలవు. అసలు చట్టసభలో సవ్యంగా జరగని పరిస్థితుల్లో ఇది అత్యాశే అవుతుందేమో…

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

10రోజుల్లో తీయాల్సింది 5 రోజుల్లో పూర్తి చేశా!

బాల‌కృష్ణ క‌ల‌ల ప్రాజెక్టు `న‌ర్త‌న‌శాల‌`. ఈ సినిమాని త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లెట్టి, 5 రోజుల షూటింగ్ త‌ర‌వాత ఆపేశారు. ఇప్పుడు ఆ 5 రోజుల పాటు తీసిన రెండు స‌న్నివేశాలే... 17...
video

`ఆర్‌.ఆర్‌.ఆర్` టీజ‌ర్‌: కోమ‌రం బెబ్బులి గాండ్రింపు

https://www.youtube.com/watch?v=BN1MwXUR3PM&feature=youtu.be `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ విశ్వ‌రూపం చూడాల‌ని నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. `లేట‌యినా.. లేటెస్టుగా వ‌స్తా` అంటూ... ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉన్నారు రాజ‌మౌళి. ఆ...

క్లిష్ట‌మైన స్థితిలో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం

ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్ కుటుంబం క‌రోనా బారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌తో పాటు శివానీ, శివాత్మికల‌కు కూడా కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. ఆ త‌ర‌వాత‌.. మిగిలిన‌వాళ్లంతా మెల్ల‌గా కోలుకున్నారు....

చంద్రబాబు బాటలో మహారాష్ట్ర సర్కార్..! సీబీఐకి రెడ్ కార్డ్…!

కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో సీబీఐని వినియోగిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వాన్ని చికాకు పరుస్తోంది.సంబంధం లేకపోయినా.. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు.. సిఫార్సులు తెప్పించుకుని.. మహారాష్ట్ర కేసులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తోంది. మొన్నటి సుషాంత్...

HOT NEWS

[X] Close
[X] Close