ప్రొ.నాగేశ్వర్ : సీఎల్పీ విలీనాన్ని కోర్టులు ఆపగలవా..?

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసుగా.. కాంగ్రెస్‌లో చేరిపోతూండటంతో… కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ వేశారు. టీఆర్ఎస్ఎల్పీలో.. సీఎల్పీ విలీన ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు అందులో కోరారు. దీన్ని అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది.

విలీనం జరగకండా ఆపాలంటూ పిటిషన్ వేయడం తొందరపాటు..!

టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనంపై… ముందుగానే ఉత్తమ్, భట్టి కోర్టుకు వెళ్లారు. ఎందుకంటే.. ఇంత వరకూ.. ఆ విలీనం ఇంత వరకూ జరగలేదు. జరగని విలీనంపై… ముందుగానే ఉత్తర్వులు కోరడం సాధ్యం కాదు. అదే సమయంలో… పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలపై చర్యలు పూర్తిగా స్పీకర్ పరిధిలో ఉంటాయి. వాటిని కోర్టు కూడా ప్రశ్నించడానికి లేదు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. దానికి .. ఫిరాయింపు నిరోధక చట్టం ఉంది. యాంటీ డిఫెక్షన్ లా అమలు చేస్తారు. దాని ప్రకారం… స్పీకర్ చర్యలు తీసుకుంటారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. అదే… సమయంలో… ముందస్తుగా.. ఓ ఘటన జరగబోతున్నదని.. దాన్ని ఆపాలని పిటిషన్ వేసే అవకాశం లేదు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కానీ…ఉత్తమ్, భట్టి లు వేసిన పిటిషన్‌లాంటి దాన్ని మాత్రం వేయలేరు. ఓ రాజ్యాంగ వ్యవస్థ.. ఈ రకంగా వ్యవహరించబోతోందని.. కోర్టులో నిరూపించడం సాధ్యం కాదు. ఎందుకంటే.. స్పీకర్ ఏం చేస్తారో తెలియదు.

లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్‌లో కోర్టులు జోక్యం చేసుకోలేవు..!

శాసనమండలిలో సీఎల్పీ విలీనాన్ని మండలి చైర్మన్ ఆమోదించారు. అలాగే.. ఇప్పుడు అసెంబ్లీలోనూ.. సీఎల్పీ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నమాట నిజం. అలా విలీనం చేయడానికే 13 మంది ఎమ్మెల్యేలను.. టీఆర్ఎస్ చేర్చుకుంటున్నారు. స్పీకర్లు .. రాజకీయ పార్టీలకు అతీతమని చెప్పుకుంటారు కానీ… వాళ్లు కూడా.. వాళ్ల పార్టీ అధినేతల మాటలకు కట్టుబడి ఉండాలి. ఆ విషయాన్ని మనం కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. కానీ కోర్టు పరిభాష మాత్రం…. వేరుగా ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తులు, స్పీకర్.. రాజ్యాంగ వ్యవస్థలు. ఓ రాజ్యాంగ వ్యవస్థ… మరో రాజ్యాంగ వ్యవస్థ ఇలా నిర్ణయాలు తీసుకోబోతోందని.. ఊహించుకుని ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. యాంటీ డిఫెక్షన్ లాపై.. స్పీకర్ కు నిర్ణయాధికారం ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకునేవరకూ కోర్టులు జోక్యం చేసుకోవు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు విచారణ చేయవచ్చు. ఎందుకంటే.. భారత రాజ్యాంగం ప్రకారం… శాసనసభలో.. జరిగే పరిణామాలపై… కోర్టులు జోక్యం చేసుకోలేవు. లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్‌లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. విలీనం అనేది.. లెజిస్లేటివ్ ప్రొసీడింగ్‌. అందువల్ల దీనిలో కోర్టులు ఇన్వాల్వ్ కావు.

కాంగ్రెస్‌ది రాజకీయ పోరాటంలో భాగమే..!

స్పీకర్ ఎప్పట్లోపు నిర్ణయం తీసుకోవాలనే దానిపై… కాల పరిమితి యాంటీ డిఫెక్షన్ లాలో లేదు. కాబట్టి.. స్పీకర్ ఎప్పుడు నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవచ్చు. లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్‌లో… స్పీకర్‌కు సర్వహక్కులు ఉంటాయి. అయితే.. నిబంధనలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగిందని అనుకుంటే… కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. స్పీకర్‌కు సర్వాధికారాలు ఉన్నాయంటే.. ఏమైనా చేయవచ్చనుకుని కాదు. సబ్‌స్టాన్షియల్ కేసేస్ ఇల్లిగాలిటీ ఎస్టాబ్లిష్ అయితే.. కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అందువల్ల అసలు స్పీకరే నిర్ణయం తీసుకోక ముందే… రాజ్యాంగ వ్యతిరేకంగా… నిర్ణయాలు తీసుకోబోతున్నారని… పిటిషన్ వేశారు. దీనిపై… కోర్టు నిర్ణయం తీసుకోలేదు. ఇదంతా రాజకీయం. టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ పోరాటం చేస్తున్నారు. హైకోర్టులో పిటిషన్ వేయడం, యాత్రలు చేయడం, ధర్నాలు చేయడం.. అన్నీ… రాజకీయ పోరాటాల్లాంటివాటిగానే చూడాలి. అంతే కానీ కోర్టు విలీనాన్ని ఆపుతుందని నేను అనుకోను.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆదర్శప్రాయ వ్యక్తిగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న తమ్మినేని..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల...

ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి...

బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌... ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు...

అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా... దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close