బీజేపీకి రాజీనామా చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి బీజేపీ అడిగితేనే రాజీనామా చేస్తానంటున్నారు. పార్టీకి చేసిన రాజీనామాను బుజ్జగించి వెనక్కి తీసుకునేలా చేస్తారని అనుకున్నారు కానీ ఆమోదించి పక్కన పడేసేసరికి రాజాసింగ్ కు లైట్లు వెలిగాయి. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని.. కిషన్ రెడ్డికి పంపానని ఆయన స్పీకర్ కు పంపవచ్చని మొదట్లో ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ హైకమాండ్ చెబితే రాజీనామా చేస్తానని అంటున్నారు.
బీజేపీకి ఆయన రాజీనామా అవసరం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం రాజీనామా కాదు.. ముందు అనర్హతా వేటు వేయమని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకున్న రాజాసింగ్.. బీజేపీ హైకమాండ్ ను తన హైకమాండ్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. గోషామహల్ తన అడ్డా అనడం లేదు.. బీజేపీ అడ్డా అంటున్నారు. అక్కడే ఆయన రాజకీయం అర్థం చేసుకున్నారని అనుచరులు సంతోషపడుతున్నారు.
రాజాసింగ్ కు బీజేపీ తప్ప మరో రాజకీయ పార్టీ సరిపడదు. ఇతర పార్టీలకూ ఆయన సరిపడడు. ఆ విషయం ఆనయ అర్థం చేసుకోలేక.. దూకుడు రాజకీయం చేసి .. అందరిపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసి పార్టీ కి దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన బీజేపీ పెద్దల్ని కలిసి ఎలాగోలా.. తనను బీజేపీలోనే కొనసాగేలా అంగీకరించ చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.