బీజేపీ ఎమ్మెల్యేలకు రేవంత్ గేట్లెత్తగలరా ?

కాంగ్రెస్‌లో చేరికల కోసం తాము గేట్లెత్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెద్ద ఎత్తున బీఆ్ఎస్ నేతల్ని చేర్చుకుంటున్నారు. కానీ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే జోలికి వెళ్లడంలేదు. తాము తల్చుకుంటే.. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నందుకు.. బీజేపీ నుంచి వైల్డ్ రియాక్షన్ వచ్చింది. అయితే చేరికల విషయంలో కోమటిరెడ్డి పాత్ర శూన్యం కాబట్టి.. బీజేపీ హైకమాండ్ సీరియస్ గాతీసుకునే చాన్స్ లేదు. అయితే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకునే ధైర్యం చేస్తారా అంటే.. ఇప్పుడా లొల్లి అవసరం ఏముంది అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బీజేపీ తరపున గెలిచారు. కొద్ది రోజుల కిందట ఆయన రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరికపై ఎక్కడా ప్రచారం లేదు. ఆయన ప్రత్యర్థిని కాంగ్రెస్‌లో చేర్చుకుని ఆయనకు చోటు లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌లో ఉండి.. బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే..కాంగ్రెస్ లోకి వస్తానని చెప్పారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. కానీ ఆయన ఆసక్తిని కాంగ్రెస్ లైట్ తీసుకుంది.

బీజేపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ టార్గెట్ చేస్తే.. వీరిలో కనీసం నలుగుర్ని గెట్లేత్తి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించవచ్చు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ జోలికి వెళ్లలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి టీడీపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టారు. అలాగే ఇపుడు రేవంత్ కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను టార్గెట్ చేస్తున్నారే కాని కమలంపార్టీ జోలికి వెళ్ళటంలేదు. అలా వెళ్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది. మోడీని బడే భాయ్ అని సంబోధించి ఆయనకు తనపై అభిమానం ఉండేలా చూసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close