ప్రైవేటు ఆస్పత్రులను తెలంగాణ సర్కార్ నియంత్రించగలదా..?

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులపై కన్నెర్ర చేస్తున్నట్లుగా రెండు రోజులుగా.. ఆదేశాలు ఇస్తోంది. మొదటగా డెక్కన్ ఆస్పత్రికి కరోనా వైద్యానికి ఇచ్చిన లైసెన్స్‌లు రద్దు చేయగా.. తర్వాత మరో రెండు కార్పొరేట్ ఆస్పత్రులపైనా కన్నెర్ర చేసినట్లుగా చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్లుగా రోగులను పిండేస్తున్నాయని… విమర్శలు వస్తున్నాయి. కరోనా పేరుతో.. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. చనిపోతే.. ఆ బిల్లులు కట్టే వరకూ మృతదేహాలను కూడా ఇవ్వడం లేదు. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించింది.

నిజానికి ప్రైవేటు ఆస్పత్రుల బిల్లుల వ్యవహారంపై ముందుగా చర్యలు తీసుకోవాల్సింది.. అపోలో, యశోదా, కాంటినెంటల్ వంటి బడా కార్పొరేట్ ఆస్పత్రులపైనే అన్న చర్చ జరుగుతోంది. కోవిడ్ చికిత్స చేయడానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ ఆస్పత్రులు వేసిన బిల్లులు… సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెడిసిన్స్ ఖర్చు 50 రూపాయలు కూడా కాదు కానీ.. మూడు రోజులకు.., నాలుగైదు లక్షలు వసూలు చేస్తూంటాయి. ఈ ఆస్పత్రుల తీరుపై.. హైకోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. కానీ ప్రభుత్వం.. వీటి జోలికి వెళ్లలేదు. మామూలు ఆస్పత్రులపై ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకుంటున్నారు.

చాలా వరకూ ప్రైవేటు ఆస్పత్రులు… బెడ్లను కూడా బ్లాక్ చేస్తున్నాయి. అందర్నీ చేర్చుకోవడం లేదు. బెడ్లు లేవని చెప్పి పంపేస్తున్నారు. వీఐపీలు… ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిని మాత్రమే చేర్చుకుటున్నారు. ఈ విషయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాతే… ప్రభుత్వం కొన్ని ధరలు నిర్ణయించి.. విడుదల చేసింది. కానీ ఆ ధరలను .. ఏ ప్రైవేటు ఆస్పత్రి కూడా పాటించడం లేదు. వాటి బిల్లులు అవి వేస్తున్నాయి. ప్రభుత్వం.. ప్రైవేటు ఆస్పత్రులను కట్టడి చేయాలంటే… అన్ని ఆస్పత్రులపైనా ఒకే రీతిన చర్యలు తీసుకుంటే దిగి వస్తాయి. కానీ ప్రభుత్వం అలా చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close