డీప్ ఫేక్ కంటెంట్‌తో ప్రముఖుల జీవితాలతో ఆటాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి అసాంఘిక శక్తులు. దారి తప్పిన వారి చేతుల్లోఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటివి బరి తెగింపుతో చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వదిలేసి..విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వాటికి బాధ్యత తీసుకోవడంలేదు. మాకు సంబంధం లేదని.. అవి సోషల్ మీడియాలో వచ్చాయి కాబట్టే తాము ప్రచారం చేస్తున్నామని చెబుతూంటారు. అంటే.. వారే క్రియేట్ చేసి.. వారే తమ హ్యాండిల్స్ లో ప్రచారం చేసి.. కానీ అవి సోషల్ మీడియాలో వచ్చినట్లే చెబుతూంటారు కానీ.. అవి నిజమైనవే అని చెప్పరు. అలా చెబితే అది ఫేక్ అని తేలితే వారిపైనే కేసులు పడతాయి కాబట్టి.
వైసీపీ ప్రధాన వ్యూహం మొదటి నుంచి ఒకటే. ఎదుటి వారిపై బురద చల్లేయడం. వారు తుడుచుకుంటూంటే.. ఆనందించడం. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడం. ఇప్పుడు లడ్డూ కల్తీ కేసులో టీటీడీని అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ ను టార్గెట్ చేశారు. ఆ వీడియో ఫేక్ కాకపోతే నిజం అయితే వైసీపీ దీన్ని అసలైనదేనని ప్రకటించి ముందు ఉండి పోరాడాలి. సోషల్ మీడియా వెనుక దాక్కకోకూడదు. అది ఫేక్ అయితే వైసీపీనే బాధ్యత తీసుకుని కేసులను ఎదుర్కోవాలి.
ఈ వీడియోతో మాకు సంబంధం లేదని.. సోషల్ మీడియాలో తిరుగుతోంది కాబట్టి తాము ప్రచారం చేస్తున్నామని .. రచ్చ చేస్తే మాత్రం వైసీపీ కుట్ర బుద్ధి బయటపడినట్లే. పోలీసులు ఈ డీప్ ఫేక్ వీడియో ఎక్కడ క్రియేట్ అయిందో తెలుసుకుని వారి విషయం తేల్చాలి. ఇలాంటివి నిర్లక్ష్యం చేస్తే.. రేపు మరొకరి మీద చేస్తారు. అలాంటి వీడియోలకు హద్దే లేకుండా పోతుంది. వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని ఇతరుల వ్యక్తిత్వంపై దాడులు చేసి.. నీతి లేని తమ నేతలతో సమానం చేయాలనుకుంటారు.
ఒక వేళ ఆ వీడియో నిజం అయితే నైతిక కోణంలో టీటీడీ చైర్మన్ ను ప్రశ్నించడానికి సర్వ హక్కులు ఉంటాయి. అందులో అంత అభ్యంతరకరమైనది ఏమీ లేకపోయినా.. టీటీడీ చైర్మన్ గా ఉన్న త స్థానంలో ఉన్న వ్యక్తి నైతిక విలువలు పాటించాల్సి ఉంటుందని ప్రశ్నించవచ్చు.