కోర్టుకెళ్తే తప్ప రాజధాని రైతుల కౌలు గుర్తుకు రాదా..!?

రాజధానికి భూములిచ్చిన రైతులకు రోజూ మానసిక వేదన తప్పడం లేదు. సమయానికి కౌలు కూడా ఇవ్వడం లేదు. రైతులు న్యాయపోరాటం కోసం కోర్టుల్లో పిటిషన్లు వేసిన తర్వాతే ప్రభుత్వం స్పందిస్తోంది. రాజధాని రైతులకువార్షిక కౌలు ఈ ఏడాది ఇంత వరకూ విడుదల చేయలేదు. దాంతో రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఒప్పందాల్ని ఉల్లంఘించి.. కౌలును విడుదల చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ రేపోమాపో విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం హడావుడిగా కౌలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాజధానికి భూములిచ్చిన రైతుల కౌలుకు 195 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది కూడా రైతులు కౌలు కోసం అదే పనిగా పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాతనే స్పందించారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. గత ప్రభుత్వం .. అమరావతి రైతుల కౌలు.. మేలో… నేరుగా నగదు బదిలీ చేసేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయాన్ని పూర్తిగా మరుగున పడేయడంతో పాటు .. రైతులకు ఇవ్వాల్సిన కౌలును కూడా… ఆలస్యం చేస్తున్నారు.

దీని కోసం రైతులు కోర్టును ఆశ్రయిస్తే తప్ప.. ప్రభుత్వంలో కదలికలు రావడం లేదు. ఇప్పటికి ప్రతీ దానికి రాజధాని రైతులు.. కోర్టు ద్వారానే ఊరట పొందాల్సి వస్తోంది. కనీసం మంజూరు చేస్తామన్న పెన్షన్లు కూడా.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. అయితే కోర్టుల భయంతో అయినా కౌలు మంజూరు చేస్తున్నందుకు రైతులు ఊరట పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close