పుస్తకాలకు లేని అభ్యంతరం సినిమాలకు ఎందుకు?

కొన్నాళ్లుగా తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో ప్రధానంగా హిందీలో, తమిళంలో బయోపిక్‌లు ఎక్కువైపోయాయి. ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్‌లు, చారిత్రక అంశాల ఆధారంగా చారిత్రక సినిమాలు తెగ నిర్మించేస్తున్నారు. బయోపిక్‌లు, చారిత్రక సినిమాలు కొన్ని హిట్‌ అవడంతో దర్శక నిర్మాతలకు ఈ పిచ్చి బాగా పట్టుకుంది. కథలు వెతుక్కునే, సొంతంగా తయారుచేసుకునే బాధ లేదని బయోపిక్‌లు నిర్మిస్తున్నారేమో మరి…! బయోపిక్‌లు అనేవి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నవి కాదు. ఆ కాన్సెప్టు కొత్తది కాదు. తెలుగుతోపాటు వివిధ భాషల్లో గతంలోనూ చాలా బయోపిక్‌లు వచ్చాయి. కాకపోతే అప్పట్లో వాటికి బయోపిక్‌ అంటూ పేరేమీ పెట్టలేదు. అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి, గాంధీ…ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద జాబితా అవుతుంది. అలా చూస్తే అన్నమయ్య, శ్రీరామదాసు మొదలైనవి కూడా బయోపిక్‌లే.

చాలా బయోపిక్‌లపై విమర్శలున్నాయి. చరిత్రను లేదా ప్రముఖుల జీవితాలను వక్రీకరిస్తున్నారనే అపవాదు ఉంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన చిరంజీవి ‘సైరా’ మీద చాలా విమర్శలు వచ్చాయి. బయోపిక్‌లను డాక్యుమెంటరీల మాదిరిగా తీస్తే జనం చూడరు కాబట్టి కొంత మసాలా జోడించి, కొన్ని ఆసక్తికర అంశాలు చొప్పించి నిర్మిస్తున్నారు. కొన్ని బయోపిక్‌లలో వివాదాస్పద అంశాలు కూడా ఉంటున్నాయి. ఎన్ని విమర్శలు, వివాదాలు వస్తున్నా బయోపిక్‌లు ఆగడంలేదు. బయోపిక్‌ల నిర్మాణం ప్రధానంగా పుస్తకాల ఆధారంగా జరుగుతోంది. ఎవరైనా ప్రముఖుడు లేదా ప్రముఖురాలిపై బయోపిక్‌ నిర్మించాలనుకుంటే, చరిత్ర ఆధారంగా సినిమా నిర్మించాలనుకుంటే అందుకు సంబంధించిన వెలువడిన పుస్తకాలను, మీడియా వార్తా కథనాలను ఆధారం చేసుకుంటున్నారు.

దాదాపు ప్రతి బయోపిక్‌, చారిత్రక సినిమా విడుదలకు ముందు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వివాదమే దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లు, వెబ్‌ సిరీస్‌ మీద తలెత్తాయి. ఈ వివాదాలు హైకోర్టు వరకూ వెళ్లాయి. కోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. జయలలిత బయోపిక్‌లకు సంబంధించి కోర్టులో కేసు వేసింది జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌. జయలలిత తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్నప్పుడు దీప తమిళ రాజకీయ తెర మీదికి వచ్చి జయ రాజకీయ వారసురాలిని, ఆస్తులకు వారసురాలిని తానేనని హంగామా చేయడం, సొంత పార్టీ పెట్టి హడావుడి చేయడం, చివరకు నిస్సహాయురాలిగా రాజకీయాలకు స్వస్తి చెప్పడం తెలిసేవుంటుంది.

రాజకీయాలకు స్వస్తి చెప్పిన దీప జయలలిత బయోపిక్‌లపై కేసు వేయడం ద్వారా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జయలలిత వ్యక్తిగత, రాజకీయ జీవితాల ఆధారంగా తమిళంలో ‘తలైవి’ పేరుతో, హిందీలో ‘జయ’ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా ‘క్వీన్‌’ అనే వెబ్‌ సిరీస్‌ తయారవుతోంది. తలైవి. జయ సినిమాలను ఎఎల్‌ విజయ్‌ డైరెక్ట్‌ చేస్తుండగా, క్వీన్‌ గౌతమ్‌ మీనన్‌ నిర్మించారు. ఇది ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలను ఆపాలని డిమాండ్‌ చేసిన దీపా జయకుమార్‌ ప్రధానంగా చెబుతున్న కారణం దర్శక నిర్మాతలు తనను సంప్రదించలేదని.

జయలలిత జీవితంపై సినిమాలు నిర్మించే చట్టపరమైన హక్కు దర్శక నిర్మాతలకు లేదని వాదించారు. తాను జయలలిత కుటుంబ సభ్యురాలినని, ఆమె జీవితంలోని ముఖ్య ఘటనలు తనకు తెలుసునని, వాటికి తాను సాక్షినని అన్నారు. సినిమాలు తీసేముందు దర్శక నిర్మాతలు తనను సంప్రదించకుండా, చర్చంచకుండా వారి సొంత ఆలోచనలతో సినిమాలు నిర్మించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మద్రాసు హైకోర్టు జయపై నిర్మించిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చూడటానికి, దీప అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవడానికిగాను రిటైర్డ్‌ జడ్జిని నియమించింది.

ఈ సినిమాల, వెబ్‌సిరీస్‌ దర్శక నిర్మాతలు తమ వాదనలు వినిపించారు. విష్ణువర్ధన్‌ ఇందూరి తన సినిమా తలైవిని అదే పేరుతో పబ్లిషైన పుస్తకం ఆధారంగా నిర్మించానని తెలిపాడు. తలైవి పుస్తకానికి అభ్యంతరం చెప్పని దీప సినిమాకు ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించాడు. గౌతమ్‌ మీనన్‌ కూడా తాను ఇంగ్లిషులో వెలువడిన క్వీన్‌ పుస్తకం ఆధారంగానే అదే పేరుతో వెబ్‌సిరీస్‌ నిర్మిస్తున్నట్లు చెప్పాడు. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వు చేసింది. తీర్పు ఎలా వస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు...

అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని...

13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెబుతారా..?: చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో... టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో...వైసీపీ సర్కార్ ఏం చేసిందో...

మీడియా వాచ్‌: తీవ్ర సంక్షోభంలో ‘ఈనాడు’

తెలుగులో అగ్ర‌గామి దిన‌ప‌త్రిక ఈనాడు. ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్‌గా చ‌లామణీ అవుతోంది. అయితే... క‌రోనా నేప‌థ్యంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా ఉప‌ద్ర‌వానికి ముందు ఈనాడు...

HOT NEWS

[X] Close
[X] Close