ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించారని బద్వేలులో షర్మిలపై కేసు పెట్టేశారు. ఎన్నికల రూల్స్ అతిక్రమించారని ఆమెపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరు ఫిర్యాదు చేశారో స్లష్టత లేదు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించొద్దని ఈ మధ్య కాలంలోనే కడప కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే సీబీఐ చార్జిషీటులో ఉన్న అంశాలను ప్రస్తావించకుండా ఆపడం తమ గొంతు నొక్కడమేనని షర్మిల చెబుతున్నారు. అందుకే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తిరిగి జిల్లా కోర్టుకు పంపింది. జిల్లా కోర్టు 9వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు అని.. ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేదిగా ఉందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.

అయితే దిగువ కోర్టు ఇంకా సడలింపులు ఇవ్వక ముందే పదే వైఎస్ వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారని షర్మిలపై కేసు నమోదు అయింది. రూల్స్‌కు వ్యతిరేకంగా కేసు అంశాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రత్యర్థులను టార్గెట్ చేశారని ఫిర్యాదులో వైసీపీ లీడర్లు పేర్కొన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. కనీసం ఈసీకి కూడా సమాచారం ఇవ్వకుండానే పోలీసులు కేసు నమోదు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

జగన్ కు విధించబోయే మొదటి శిక్ష ఇదేనా..?

ఏపీలో కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసన సభాపతి చైర్ లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు..? అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది....

రూట్ మార్చిన అధికారులు – ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం

ఏపీ రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం...

మంచు మ‌నోజ్‌… మోస్ట్ డేంజ‌రెస్

మంచు మ‌నోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంది. త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వెరైటీగా విల‌న్ పాత్ర‌ల‌పై మోజు పెంచుకొన్నాడు. త‌న‌కు అలాంటి అవ‌కాశాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. 'మిరాయ్‌'లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close