ఆ వీడియో చూపించారని దేవినేని ఉమపై కేసు..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలపై కేసులు పెట్టడం సహజమే. ముఖ్యంగా సీఐడీ పోలీసులు ఆ విషయంలో చాలా ముందు ఉంటారు. ఎవరో చెబుతున్నట్లుగా చిత్ర విచిత్రమైన కేసులు పెడుతూ ఉంటారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు పెట్టారు. రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేసినట్లుగా ఆరోపిస్తూ..  సెక్షన్ 505 కింద కేసు పెట్టారు. అంతగా వర్గాల మధ్య చిచ్చు రాజేసే పని దేవినేని ఉమ ఏం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. కేసు వివరాలు చూస్తే.. అందులో దేవినేని ఉమ ఓ వీడియోను విడుదల చేశారని అది మార్ఫింగ్ అని.. వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉన్న దేవినేని ఉమ.. గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల క్లిప్‌ను మీడియాకు విడుదల చేశారు. తిరుపతిలో చదువుకున్న వారు ఉండటానికి ఇష్టపడరని ఓ సారి జగన్ వ్యాఖ్యానించారని దేవినేని ఉమ చెబుతున్నారు. 

నిజానికి అది పాత వీడియో. ఎప్పట్నుంచే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఎలా ఉండాలో ఉదహరిస్తూ…  తిరుపతి గురించి టంగ్ స్లిప్ అయ్యారని ఆ వీడియో క్లిప్‌లో ఉంది.  అప్పటి నుంచి ఆ వీడియో సోషల్ మీడియాలో  ఉంది. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక జరుగుతోందని… దాన్ని టీడీపీ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. ఆ తర్వాత ఈ వీడియో ఇంకా ఎక్కువ సర్క్యూలేట్ అవుతోంది. దీంతో కర్నూలు జిల్లాలోని ఓ వైసీపీ కార్యకర్త… అది మార్ఫింగ్ వీడియో అని ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు వస్తుందని .. కేసులు నమోదు చేయాలని ముందుగానే ప్రోగ్రామ్ చేసినట్లుగా పోలీసులు కదిలిపోయారు. 

నిజంగా అది మార్ఫింగ్ అయితే.. కర్నూలు జిల్లాలోని కార్యకర్త ఫిర్యాదు చేయాల్సిన పని లేదని.. ముఖ్యమంత్రి వీడియో కాబట్టి ప్రభుత్వమే స్పందించవచ్చని కొంత మంది అంటున్నారు. ఈ కేసుపై దేవినేని ఉమ… మండిపడ్డారు. ప్రతి అమావాస్యకు తనపై కేసులు పెడుతున్నారని …తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కత్తిపోటుతో చనిపోతే గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టు.. వివేకానంద ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో వారిపైనే కేసు పెట్టు.. బాబాయ్ రక్తాన్ని తుడిచిన వారిపైనే కేసు పెట్టు అని జగన్‌కు దేవినేని ఉమ సవాల్ చేశారు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close