వైసీపీలో మాగుంటకు సెగ..! రేపో మాపో..?

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిపై నెల్లూరులో కేసు నమోదైంది. అదేదో ఎన్నికల కేసు కాదు. అక్రమ మట్టి తవ్వకాల కేసు. నెల్లూరు జిల్లాలో కొద్ది రోజులుగా అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై దుమారం రేగుతోంది. రాత్రింబవళ్లు ఎలా మట్టిని తవ్వి, తరలిస్తున్నారో ప్రతిపక్ష నేతలు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి పెద్ద ఎత్తున మట్టి తవ్వుకుపోయారంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనను ఏ-2గా చూపించారు. గత మే 28న తూపిలి విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేసుకున్నారు. తర్వాతి రోజే అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఎంపీ తండ్రి పేరుతో జూన్‌లో అనుమతులు ఇచ్చారు.

కానీ అనుమతులు తీసుకున్న కారణానికి కాకుండా మట్టిని మార్కెట్లోకి తరలించి అమ్ముకున్నారని అధికారులు గుర్తించారు. అలాగే అనుమతి ఇచ్చిన దాని కన్నా ఎక్కువ తవ్వుకున్నారని తేల్చారు. దీంతో మట్టి తవ్వకాలకు అనుమతులు పొందిన వారిపై కేసులు పెట్టారు. ఆ ముగ్గురిలో ఒకరు మాగుంట శ్రీనివాసుల రెడ్డి. అయితే ఈకేసు నమోదు చేసి చాలా కాలం అయింది. జూన్‌ 21న కేసు నమోదు చేసి.. ఏం చర్యలు తీసుకోకుండా పక్కన పెట్టారు. అయితే నిజంగా మట్టి తవ్వకాలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దరఖాస్తు చేసుకున్నా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం.. ఆయన తరపున ముందుకొచ్చి మాట్లాడటం ప్రారంభించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డికి తెలియకుండా ఆయన పేరుతో గ్రావెల్‌ తవ్వకాలకు వైసీపీ నేతలు ఫోర్జరీ సంతకాలతో దరఖాస్తు పెట్టారని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. ఇదంతా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుట్రతోనే జరిగిందని అంటున్నారు.

మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఎంపీగా గెల్చినప్పటికీ ఆయన పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. తన పనేదో తాను చేసుకుని వెళ్తున్నారు. ఆయనకు చెందిన లిక్కర్ కంపెనీలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. అంతే కాదు… కొనుగోళ్లు కూడా ఆపేసింది. ప్రముఖ బ్రాండ్లను ఉత్పత్తి చేసే ఆయన కంపెనీకి ఏపీలో అమ్మకాలు లేవు. ఈ కారణంగా ఆయన బిజినెస్ అంతా ఇతర రాష్ట్రాల్లో చేసుకుంటున్నారు. పైగా.. సొంత ఎంపీ అయినప్పటికీ.. ఆయన లిక్కర్ ఫ్యాక్టరీలు తమకు అప్పగించాలని.. ఒత్తిడి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో… ఆయనపై సీరియస్‌ కేసు నమోదు కావడం..ఆ విషయం బయటకు రావడం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close