చైతన్య : ఏపీలో ఆ కులమైతే లొంగిపోవాలి..! లేకపోతే చావాలి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఓ విభిన్న రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ కులాల ప్రకారం.. ప్రజలు పార్టీలకు మద్దతుగా ఉంటారని చెప్పుకున్నారు. కానీ.. ఇప్పుడు… తమకు మద్దతివ్వని కులాల అంతు చూడాలనే విధానానికి పాలకులు వచ్చేశారు. ఓ సారి గెలిచిన తర్వాత కులమతాలకు అతీతంగా పాలన చేయడం.. రాజ్యాధినేత లక్షణం. అలా కాకుండా.. తను.. తన కులం.. తన వాళ్లకు మాత్రమే సీఎం.. మిగతా వాళ్లందరికీ.. యమకింకరుడ్ని అనుకుంటే మాత్రం… ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నారు. ఓ కులాన్ని నాశనం చేస్తానంటూ.. స్వయంగా ముఖ్యమంత్రే బయలుదేరడం… అధికారాన్ని, చట్టాన్ని, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడంటం… కనివినీ ఎరుగని రీతిలో జరుగుతోంది.

ఆత్మహత్య చేసుకున్నా వదిలి పెట్టనంత క్రూరత్వం..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఓ కులాన్ని.. నిర్వీర్యం చేస్తానంటూ.. అధికార పార్టీ పెద్దలు.. బహిరంగంగానే విర్రవీగుతున్నారు. దాని ప్రకారం.. వందల కేసుల పరంపర.. ఆయా నేతలు.. సామాన్యులపై ప్రారంభమయ్యాయి. ఓ వైపు.. వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరు నిందితులో సులువుగా తెలుసుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నా… లైట్ తీసుకుంటున్న పోలీసులు… ఓ కులం వారిపై మాత్రం.. ఫిర్యాదు రావడమే ఆలస్యం పరువు తీసేందుకు పరుగులు పెడుతున్నారు. అటు పాలకుల క్రూరత్వం.. ఇటు పోలీసుల బానిసత్వం కలిపి… మాజీ స్పీకర్ స్థాయి నేత ఆత్మహత్య చేసుకోవాల్సివచ్చింది. మరికొందరు సరెండర్ అయిపోతామంటూ.. కాళ్ల బేరానికి వెళ్లాల్సి వస్తోంది. వీరంతా.. మాపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ.. గగ్గోలు పెడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా.. మాజీ స్పీకర్ కుటుంబాన్ని వదల్లేదు. ఆయన బినామీల్ని పట్టుకున్నామంటూ.. ఇప్పటికీ పోలీసుల పేరుతో వికృత క్రీడ నడుస్తూనే ఉంది.

ఆర్థికంగా బికారుల్ని చేస్తామంటూ వీరంగం..!

ఓ సామాజికవర్గం వారి వ్యాపారాల్ని నిర్వీర్యం చేస్తామని.. వారందర్నీ.. బికారులుగా చేస్తామంటూ.. బహిరంగంగానే.. ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారన్న విషయం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. నిజంగా అధికారం దక్కించుకున్నోళ్లకు.. తనకు మద్దతు ఇవ్వలేదన్న కారణంగా… యాభై శాతం ఓటర్లను.. సర్వనాశనం చేసేందుకు హక్కు పొందినట్లు అవుతుందా..? హక్కు పొందినట్లుగానే భావిస్తూ.. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ… ఓ వర్గ ప్రజలను పీడిస్తున్న సూచనలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ కులంపై అందర్నీ రెచ్చగొట్టి.. గద్దెనెక్కి.. ఇప్పుడు… ఉపాధి లేకుండా చేసి ఉసురు తీస్తున్న పెద్దలు… ఆ పాపాలను మరిపింపచేయడానికి ఓ కులంపై దండెత్తుతున్నారు. వారిని బికారులుగా చేస్తామటూ.. పేట్రేగిపోతున్నారు.

ఇలాంటి వివక్షా పాలన వల్లే వైషమ్యాలు..!

ఒకరిపై వివక్ష చూపించినప్పుడే.. సమాజంపై వారిలో కసి పెరుగుతుంది. ఇప్పటి వరకూ.. కొన్ని వర్గాలపై.. అలాంటి వివక్ష చూపించడం వల్లే.. అనేక రకాల సమస్యలు వచ్చాయి. ఇప్పుడు అగ్ర కులాలపై అలాంటి వివక్షను..మరో అగ్రకుల పాలకులు చూపిస్తున్నారు. దాంతో… ఒకరిపై ఒకరు ఏహ్యభావం పెరిగిపోతుంది. అది రాజకీయానికి పనికొస్తుందేమో కానీ.. రోజువారీ జీవితంలో… విధ్వంసానికి మాత్రమే కారణం అవుతుంది. అలా చేయడం వల్ల.. ఎవరు బాగుపడతారో.. ఎవరూ అంచనా వేయలేరు. ఎవరూ బాగుపడరు కూడా. జరిగేది నష్టమే. అదీ ఈ రాజకీయాలకు సంబంధం లేని సామాన్యులకే. పాలకులు ఎంత కురచగా ఉంటే.. ఆలోచనలూ అలాగే ఉంటాయని మరోసారి నిరూపితమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close