సరైనోడులో ఎమ్మెల్యేగా కనిపించింది కేథరిన్ థెరిస్సా. ఆ సినిమా హిట్టయినా కేథరిన్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. సెకండ్ హీరోయిన్ అనే ముద్ర అయితే బలంగా పడింది. కానీ.. ఆ తరహా పాత్రలు కూడా దొరకడం లేదు. అందుకనేనేమో.. ఎమ్మెల్యే పాత్ర సృష్టించిన బోయపాటి శ్రీనునే… కేథరిన్‌కి మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈసారి ఐటెమ్ గాళ్‌గా. సరైనోడు తరవాత బోయపాటి శ్రీను.. బెల్లంకొండ శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కేథరిన్ ఐటెమ్ గాళ్‌గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయిక పోస్టుని పంచుకొన్నారు. ఇప్పుడు కేథరిన్ కూడా చేరింది. దాంతో ఈ సినిమాకి గ్లామర్ డోసు పెరిగినట్టైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఉగాది నాటికి ఫస్ట్ లుక్ విడుదల చేయాలని చూస్తున్నారు. జూన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లుడు శ్రీను తరవాత స్పీడున్నోడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అందుకే… ఆశలన్నీ బోయపాటిపై పెట్టుకొన్నాడు. బోయపాటి కూడా.. పెద్ద హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని డిజైన్ చేస్తున్నాడు. ఖర్చు కూడా బాగానే పెట్టిస్తున్నాడట. కేథరిన్‌కి కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది.