సీబీఐ ‘మాజీ’ విజయరామారావు కొడుకుపై సీబీఐ కేసు!

హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్‌గా గతంలో పనిచేసిన ఏపీ మాజీ మంత్రి, ప్రస్తుత తెరాస నేత విజయరామారావు కుమారుడు ఒక సీబీఐ కేసులో బుక్ అవటం సంచలనం సృష్టిస్తోంది. శ్రీనివాస కళ్యాణ్‌రావు అనే ఈయన మూడు బ్యాంకులనుంచి నకిలీ డాక్యుమెంట్‌లతో బ్యాంకులనుంచి వందలకోట్ల రుణాలు తీసుకోవటమేకాక వాటిని ఎగ్గొట్టటంతో ఆ బ్యాంకుల అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేశారు. సీబీఐ వారు 420, 120బీ తదితర సెక్షన్‌లకింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస కళ్యాణ్‌కు చెన్నైలో, హైదరాబాద్‌లో ఉన్న నివాసాలపై దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణ్ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో మొత్తం రు.304 కోట్లమేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టినట్లు తేలింది. దీనిలో కార్పొరేషన్ బ్యాంకు నుంచి రు.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రు.124 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రు.60 కోట్లు తీసుకున్నారు. సెంట్రల్ బ్యాంకు ఆడిట్‌లో అతను నకిలీ ఇన్వాయిస్‌లతో రుణాలు తీసుకున్నట్లు తేలింది. సీబీఐ అధికారులు నిన్న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లో ఉన్న అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. అతనిని త్వరలో ప్రశ్నించనున్నారని సమాచారం. విజయరామారావు నాడు సీబీఐ డైరెక్టర్‌గా సమర్థవంతంగా పనిచేశారని పేరు సంపాదించుకున్నారు. ఆయన కొడుకు ఈ విధంగా తండ్రి పరువును తీయటం విచారకరం. విజయరామారావు ఇటీవలే తెలుగుదేశానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close