సీబీఐ కోర్టు సీబీఐకి షాకిచ్చింది. జగన్ కోర్టు షరతులు ఉల్లంఘించారని పని చేయని ఫోన్ నెంబర్ ఇచ్చి విదేశాలకు వెళ్లాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మూడు సార్లు ఫోన్ చేశామని అయినా ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. తన ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడం కోర్టు షరతుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
అయితే జగన్ ఎప్పుడూ అలాగే చేస్తారని ఆయన తరపు లాయర్లు వాదించారు. పైగా జగన్ ఇండియాకు వచ్చేశారని.. పాస్ పోర్టు కూడా కోర్టులో సబ్ మిట్ చేశారని తెలిపారు. వాదనలు విన్న తర్వాత పిటిషన్ ను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ చేసిన విజ్ఞప్తిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
జగన్ అందుబాటులోకి రాకపోవడంతోనే సీబీఐ అధికారులు ఫోన్ నెంబర్ గురించి ప్రస్తావించి పిటిషన్ వేశారు. వెంటనే జగన్ తన పర్యటనను కుదిరించుకుని మూడు రోజుల ముందుగానే ఇండియాకు వచ్చారు. అదే విషయాన్ని కోర్టులో చెప్పి పిటిషన్ కొట్టి వేయించుకోగలిగారు.
