జగన్ ,విజయసాయిలకు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్లు డిస్మిస్ !

ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు రిలీఫ్ లభించింది. వారి బెయిళ్లను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. రాజకీయ ఉద్దేశాలతోనే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారన్న జగన్ లాయర్ల వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు రఘురామకొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం జగన్, విజయ సాయిరెడ్డిలకు ఊరట లభించినట్లయింది.

షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి .. సీఎంగా తన అధికారాన్ని ఉపయోగిస్తూ షరతులు ఉల్లంఘిస్తున్నారని… విజయసాయిరెడ్డి కూడా అదే పని చేస్తున్నారని వేర్వేరుగా రఘురామకృష్ణరాజు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై సీబీఐ ఎలాంటి అభిప్రాయం చెప్పకపోవడం జగన్, విజయసాయిలకు కలసి వచ్చింది. మెరిట్ ప్రకారం సీబీఐ కోర్టే నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో సీబీఐ కోర్టు పిటిషన్ కొట్టి వేయడానికి ఎక్కువ చాన్సులున్నాయన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో మొదటి నుంచి వినిపించింది.

జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టి వేశారని సాక్షి మీడియాలో ముందుగానే ప్రచారం చేయడంతో సెప్టెంబర్ 14న హైకోర్టులో రఘురామ బెంచ్ మార్చాలన్న పిటిషన్‌ను ఎంపీ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయడంతో తీర్పు చెప్పడానికి మార్గం సుగమం అయింది. పిటిషన్ల కొట్టివేతపై స్పందించిన రఘురామకృష్ణ రాజు సాక్షిలో వచ్చిన వార్తే నిజమైందన్నారు. త్వరలో హైకోర్టులో అప్పీల్ చేస్తానని ఒక వేళ హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close