సీబీఐ డైరక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్కు వచ్చారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేస్తూ ప్రభుత్వం లేఖ పంపింది. ఈ క్రమంలో సీబీఐ డైరక్టర్ నేరుగా హైదరాబాద్లో పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది.
కాళేశ్వరం విషయంలో సీబీఐ ఎలాంటి విధానం అవలంభించనుందన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం విషయం కోర్టులో ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అంటే ఆ రిపోర్టు ఆధారంగా సీబీఐ చర్యలు ప్రారంభించే అవకాశం లేదు.కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ రిపోర్టు ఆధారంగా కాకుండా.. జనరల్ గానే కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు చేయాలని లేఖ రాసింది. సీబీఐ ఆ మేరకు అక్నాలెడ్జ్ చేసింది.
సీబీఐ సీరియస్గా దర్యాప్తు చేయాలనుకుంటే ఈ కేసు సంచలనం అవుతుంది. లేదా కేసును టేకప్ చేసి.. పక్కన పెట్టాలనుకుంటే పెడుతుంది. ఈ కేసు ఎలా సాగాలన్నది రాజకీయ వ్యూహాల ప్రకారం ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటే.. ఖచ్చితంగా కాళేశ్వరంపై సీరియస్ దర్యాప్తు సాగుతుందని నమ్ముతున్నారు. ఇందులో చాలా పెద్ద పెద్ద లింకులు ఉన్నాయి. వాటన్నింటినీ దాటి విచారణ వరకూ రావడం అద్భుతమే అవుతుందని అనుకుంటున్నారు. మరి సీబీఐ ఏం చేస్తుందో ?