కేజ్రీవాల్‌కూ లిక్కర్ స్కాం ముప్పు – ఏం జరగనుంది ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు జారీ చేసింది. పదహారో తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇదే కేసులో అరెస్ట్ చేశారు. జైల్లోనే విచారణ కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు. కీలకమైన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఈ వేధింపులు ఆగవు అంటూ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వారికి బెయిల్ లబించడం లేదు. మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైదరాబాద్ వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి.. తన భార్య ఆరోగ్యం బాగో లేనందున నాలుగు వారాల మధ్యంతర బెయిల్ కావాలని కోరడంతో కోర్టు అంగీకరించింది. ఇక ఎవరికీ బెయిల్ దక్కడం లేదు. ఇటీవల జైల్లో ఉన్న క్రిమినల్ సుకేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్లలో కేజ్రీవాల్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తోంది. కేజ్రీవాల్ చెప్పినట్లుగానే హైదరాబాద్‌లో కవితకు రూ. పదిహేను కోట్లు అందించినట్లుగా వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది.

ఇదే స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. తన పది ఫోన్లను ఈడీకి ఇచ్చారు. అయితే ఆమె తాను గాయపడినట్లుగా ప్రకటించారు. మూడు వారాల బెడ్ రెస్ట్ అవసరం కావడంతో ప్రస్తుతం బయటకు రావడం లేదు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. సుకేష్ వాట్సాప్ టాప్ ఫేక్ అని ఆమె స్పష్టం చేశారు. మరో వైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేయడంతో.. ఆమ్ఆద్మీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలుగు రాష్ట్రాల్లో నామినేష‌న్లు షురూ…

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి మ‌రింత ప‌దునెక్క‌నుంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ గురువారం నుండి మొద‌ల‌వుతుండ‌టం, మంచి రోజు కావ‌టంతో మొద‌టి రోజే నామినేష‌న్లు భారీగా దాఖ‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీకి, లోక్...

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి...

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close