వివేకా కేసులో జగన్ – హైకోర్టులో సీబీఐ సంచలనం !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీఎం జగన్ పేరును తొలి సారి ప్రస్తావించింది సీబీఐ. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్‌లో సీఎం జగన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. హత్య విషయం జగన్ కు ఉదయం 6.15 కంటే ముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్యకు గురయినట్లుగా మందుగా చూసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే హత్య విషయం జగన్ కు తెలుసన్నారు.

జగన్ కు అవినాష్ రెడ్డే చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందిని సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపింది. శుక్రవారం సీబీఐ వాదనలు వినిపించలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనలు వినిపించడంతో సమయం గడిచిపోయింది. శనివారం ఉదయం సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎం జగన్ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే వివేకానందరెడ్డి హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు.

తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని చెప్పారు. జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్‌, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడాలని సీబీఐ గుర్తించి వారిని పిలిచి ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం కీలక మలుపులు తిరగబోతున్నట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరో వైపు అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ వేసిన అనుబంధ అఫిడవిట్ సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

కృతిశెట్టికి బూస్ట్ లాంటి ఆఫర్

'ఉప్పెన' సినిమాతో ఒక్కసారి స్టార్ హీరోయిన్ కేటగిరీలో కి వెళ్ళిపోయింది కృతిశెట్టి. నిజంగా ఒక ఉప్పెనలానే ఆమెకు అవకాశలు దక్కాయి. కానీ విజయాలు మాత్రం రాలేదు. ఇండస్ట్రీ విజయాలే కీలకం. అందం, అభినయం...

రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ వృత్తినే వైసీపీ అవమానించింది: బాలకృష్ణ

అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని, ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగేది కాదని, ప్రభుత్వం చంద్రబాబుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close