తమిళనాడులో అమిత్ షా పర్యటించి వెళ్లిన ఒక్క రోజులోనే సీబీఐకి విజయ్‌కు నోటీసులు ఇచ్చింది. విజయ్‌తో పొత్తు విషయాన్ని అమిత్ షా చాలా సీరియస్‌గా తీసుకున్నారని తమిళమీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇలాంటి సమయంలో.. వెంటనే విజయ్‌కు సీబీఐ నోటీసులు పంపింది. కరూర్ తొక్కిసలాట కేసులో 12న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నిజానికి సీబీఐ విచారణ కోసమే విజయ్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి విజయం సాధించారు.
గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన రాజకీయ బహిరంగ సభలో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోగా , 60 మందికి పైగా గాయపడ్డారు. తొలుత స్థానిక పోలీసులు విచారించారు. కానీ విజయ్ సీబీఐకి ఇవ్వాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసును అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. దీనిపై పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా కోర్టు ఏర్పాటు చేసింది.
ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా విజయ్ను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసును తమిళనాడు ప్రభుత్వమే విచారణ జరిపినట్లయితే.. ఎలాంటి చర్యలు తీసుకున్నా అది కక్ష సాధింపుగా చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ విజయ్ సీబీఐ విచారణకు డిమాండ్ చేసి సాధించుకోవడంతో ఇప్పుడు సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకున్నా భరించాల్సిందే. అంటే వెళ్లి వెళ్లి సీబీఐకి చిక్కినట్లయింది. బీజేపీ సీబీఐని రాజకీయంగా ఉపయోగించుకుంటుందని ఆరోపణలు ఉన్న సమయంలో విజయ్ నేరుగా వెళ్లి బీజేపీకి చిక్కారు. ఇప్పుడు ఆయన ఎలా తప్పించుకుంటారన్నది ఆసక్తికరం.
