హిమాచల్ ముఖ్యమంత్రి ఇళ్ళపై సి.బి.ఐ. దాడులు

అవినీతి, అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ భద్ర సింగ్ కి చెందిన ఇళ్ళు, కార్యాలయాలపై సి.బి.ఐ. అధికారులు శనివారంనాడు ఒకే సమయంలో దాడులు నిర్వహించారు. డిల్లీ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకి చెందిన 11 ఇళ్ళు, కార్యాలయాలపై జరిగిన తణికీలలో మొత్తం సి.బి.ఐ. 18మంది అధికారులు పాల్గొన్నారు. డిల్లీలో వారితో బాటు ఈడీ అధికారులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. రెండు చోట్ల అధికారులు తణికీలు నిర్వహిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వీర్ భద్ర సింగ్ డిల్లీ ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని సమాచారం. అధికారులు అనేక కీలకమయిన ఫైళ్ళు స్వాధీనం చేసుకొన్నారు. ముఖ్యమంత్రి వీర్ భద్ర సింగ్ పై చాలా కాలంగా అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. కానీ ఇంతకాలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటంతో ఏ సమస్య లేకుండా జరిగిపోయింది. కానీ ఇప్పుడు కేనద్రంలో ప్రభుత్వం మారడంతో అవినీతి భాగోతాలపై సి.బి.ఐ. దర్యాప్తు మొదలుపెట్టడంతో అన్నీ ఒకటొకటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఒక విద్యుత్ ఉత్పత్తి సంస్థ యొక్క లైసెన్స్ ని 10నెలల పాటు పొడిగించేందుకు ఆయన తమ వద్ద నుండి ముడుపులు తీసుకొన్నారని ఆ సంస్థ యాజమాయం స్వయంగా ప్రకటించడంతో ఆయన ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలపై దర్య్పాతు చేస్తున్న సి.బి.ఐ. మరియు ఆదాయశాఖలను నాలుగు వారాలలోగా నివేదిక ఇమ్మని డిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వీర్ భద్ర సింగ్ ఇళ్ళు, కార్యాలయాలపై సి.బి.ఐ. అధికారులు దాడులు చేయడంతో, కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకే మోడీ పభుత్వం సి.బి.ఐ. అధికారులను వీర్ భద్ర సింగ్ ఇంటి మీదకు ఉసిగొల్పిందని ఆరోపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close