వైఎస్ వినేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన తండ్రి హత్య కేసు విచారణలో పోలీసులు నిందితులు కుమ్మక్కయ్యారని.. విచారణాధికారులను కూడా బెదిరిస్తున్నారని ..కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి.. లేకపోతే… విచారణ ఇతర రాష్ట్రాలకు తరలించాలని సునీత పెట్టుకున్న పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఏ మాత్రం మొహమాటం పెట్టుకోకుండా సునీత చెప్పిందంతా నిజమేనని తేల్చేసింది.
వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో సీఐగా ఉన్న శంకరయ్య… విచారణ సమయంలో కోర్టులో 164 సెక్షన్ కింద స్టేట్ మెంట్ ఇస్తామని అంగీకరించారన్నారు. తర్వాత ఆయనకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిందని… ఆ తర్వాత ఆయన మార్చారని సుప్రీంకోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. అదే సమయంలో విచారణాధికారిపైనే నిందుతులు ఎదురు కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఏపీ పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని అందుకే విచారణ జాప్యం అవుతోందని సీబీఐ స్పష్టం చేసింది.
నేరు సీబీఐ వివేకా హత్య కేసులో పోలీసులు, ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పడం, నిందితులు – పోలీసులు కుమ్మక్కయ్యాని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కేసును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న వైఎస్ సునీత పిటిషన్‌కు బలం లభించినట్లయిందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో అనేక ఘటనలు జరిగాయి. సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ.. సాక్షులు..నిందితులుగా ఉన్నవారు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై కేసు కూడా నమోదు చేశారు. అన్నీ కలిపి .. పోలీసుల నిర్వాకాన్ని వెలుగులోకి తెస్తుంది. కేసు విచారణను ప్రభావితం చేయాలనకుున్న ప్రభుత్వ పెద్దల తీరు వెలుగులోకి రాబోతోంది.