జగన్, చంద్రబాబు ఇద్దరూ లేఖలు రాశారు..! అయితే ఏంటి..?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఉమ్మడిగా పోరాడి… ఆంధ్రుల హక్కును కాపాడాల్సిన ఏపీ రాజకీయ పార్టీలు… పొలిటికల్ క్రెడిట్ గేమ్ ఆడుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని … ప్రజల్లో ఎదురుటివారిని తప్పుగా చూపించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దని ప్రభుత్వాన్ని నిఖార్సుగా ఒత్తిడి చేసే ప్రయత్నాలు మాత్రం చేయడంలేదు. తాజాగా… సీఎం జగన్, చంద్రబాబు ప్రధాని మోదీకి రాసిన లేఖల విషయంలో రంధ్రాన్వేషణ బయటపడింది. అయితే.. ఇద్దరూ లేఖలు రాశారని.. చంద్రబాబు రెండు లేఖలు రాశారని… పీఎంవో తేల్చేసింది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత సీఎం జగన్ సైలెంట్‌గా ఉంటున్నారని ఆయన స్పందించాలని వచ్చిన డిమాండ్ల నేపధ్యంలో ప్రధానమంత్రి మోడీకి ఓ లేఖ రాశారు. అయితే దానిపై ప్రధాని స్పందించలేదు. దీంతో… సీఎం జగన్ లేఖ రాయలేదని.. ఉత్తినే రాశారని ప్రచారం చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. రివర్స్‌లో వైసీపీ నేతలు చంద్రబాబు ఆ లేఖ కూడా రాయలేదు కదా అని విమర్శలు చేశారు. చివరికి చంద్రబాబు వేర్వేరు సందర్భాల్లో రెండు లేఖలు రాశారు. అయితే ఆయన రాయలేదని.. ఉత్తుత్తినే రాసినట్లుగా చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించేవారు. అలా… ఎవరు లేఖలు రాయలేదో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో నేరుగా సమాచార హక్కుచట్టం కింద.. కొంత మంది పీఎంవోకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇద్దరూ లేఖలు రాశారని… పీఎంవో స్పష్టం చేసింది. వాటినిసంబంధిత శాఖకు పంపామని వారు సమాధానం పంపుతారని క్లారిటీ ఇచ్చింది.

ఇక్కడ సమస్య వారు లేఖలు రాయడమే. టీడీపీ, వైసీపీ ఇలా… ఎవరికి వారు ప్రత్యర్థులపై బురదచల్లేందుకు సమయం కేటాయించారు కానీ… సమైక్యంగా పోరాడి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందామనే ప్రయత్నాలు చేయడంలేదు. పార్లమెంట్‌లో కూడా ఎవరికి వారు మాట్లాడుతున్నారు. దీంతో కేంద్రం లైట్ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తినప్పుడు అక్కడి ఎంపీలు పార్టీలకు అతీతంగా సభను స్తంభింపచేసేవారు. సమస్య తీవ్రతను తెలియచేసేవారు. కానీ ఇప్పుడు.. ఏపీ ఎంపీల్లో ఆ స్ఫూర్తి కొరవడింది. గతంలో ప్రత్యేక హోదా కోసం … రెండు పార్టీల ఎంపీలు విడివిడిగా అయినా సభను స్తంభింపచేసేవారు.

స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేయడంలో రాజకీయ పార్టీలదే ప్రధాన పాత్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది సాధ్యం కాదనేది అందరూ చెప్పేమాట. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం వాటాలు ప్రభుత్వానికి ఉండవచ్చు కానీ… ఆ ప్లాంట్ ఏపీలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగితేనే పోస్కో ఏపీ వైపు చూస్తోంది. తాము సిద్ధంగా లేమని ఏపీ సర్కార్ ఒక్క మాట చెబితే.. ప్రైవేటీకరణ ఆగిపోతుంది. ప్రభుత్వ పరంగా అలాంటి ప్రయత్నం చేయకుండా రాజకీయ పరంగా పోరాడుతున్నట్లుగా నటించడం వల్ల.. మొదటికే మోసం వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ : మాస్ట్రో

మంచి క‌థ‌ని ఎంత చెత్త‌గా తీసినా చూడొచ్చు చెత్త క‌థ‌ని ఎంత బాగా చెప్పాల‌నుకున్నా చూడ‌లేం - అన్న‌ది సినిమా వాళ్లు న‌మ్మే మాట. అందుకే మంచి క‌థ‌లు ఎక్క‌డైనా స‌రే చ‌లామ‌ణీ అయిపోతుంటాయి....

ల‌వ్ స్టోరీ కోసం చిరంజీవి

నాగార్జున‌తో చిరంజీవికి ఉన్న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. నాగార్జున `వైల్డ్ డాగ్` స‌మ‌యంలో చిరు ప్ర‌త్యేక‌మైన అభిమానంతో ఆ సినిమాని ప్ర‌మోట్ చేశాడు. నాగ‌చైత‌న్య‌,...

ఏపీలో ఇళ్ల రుణాల వన్‌టైం సెటిల్మెంట్ పథకం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రజలను ఇళ్ల రుణాల నుంచి విముక్తుల్ని చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ లోన్ల భారంతో కట్టలేకపోయిన 46 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ వన్ టైం...

చిన్నారి హత్యాచార నిందితుడి “ఆత్మహత్య” శిక్ష!

రాజకీయ వివాదంగా మారిన సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు చివరికి "ఆత్మహత్య" శిక్షకు గురయ్యాడు. రాజు అనే ఆ నిందితుడి మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించారు. ఘట్...

HOT NEWS

[X] Close
[X] Close