అదిగో పార్టీ …ఇవిగో డ్రగ్స్ !

అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న తరహాలో ఎక్కడైనా పబ్‌లో పార్టీలు జరుగుతున్నాయంటే అందులో డ్రగ్స్ కామన్ అని డిసైడైపోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రతి పబ్ వీకెండ్‌లో కిక్కిరిసిపోతుంది. తెల్లవారుజామున మూడుగంటల వరకూ పార్టీ చేసుకుని వెళ్తూంటారు. ఇందులో బాగా సంపాదించే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల దగ్గర్నుంచి తెగ సంపాదించేసిన బడాబాబుల పిల్లల వరకూ ఉంటారు. ఏపబ్ మీద దాడి చేసిన కనీసం వంద మందికి తగ్గకుండా దొరకుతారు. అలా రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని పుడింగ్ అండ్ మింగ్ పబ్‌పై శనివారం ఆర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు. నూట యభై మందిని అదుపులోకి తీసుకున్నారు. అందర్నీ స్టేషన్‌కు తీసుకు వచ్చి పేర్లురాసుకుని .. నోటీసులు ఇచ్చి పంపేశారు.

అక్కడ ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. ఏం జరుగుతుందో పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. 142 మంది దొరికారు అంటూ పేర్లు విడుదల చేశారు. కానీ అందులో చాలా మంది పేర్లు లేవు. పోలీస్ స్టేషన్‌లో కనిపించిన కొణిదెల నిహారిక పేరు కూడా లేదు. అలాగే మాజీ డీజీపీ కుమార్తె, మాజీ ఎంపీ కుమారుడు వంటి వారి పేర్లు లేవు. కానీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్ పేరు ఉంది. పోలీసుల తీరు ఓ వైపు ఇలా ఉంటే.. అసలు డ్రగ్స్ దొరికాయా.. దొరికితే ఎంత పెద్దమొత్తంలో దొరికాయి.. పట్టుకున్న వారి దగ్గర శాంపిల్స్ తీసుకున్నారా అంటే.. పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. అధికారిక ప్రకటన కూడా చేయలేదు. దీంతో మీడియా ఊహాగానాల పండగ చేసుకుంది. ఆరు గ్రాముల కొకైన్ దొరికిందని ఒకరు.. బాత్‌రూలంలో తాగిపడేసిన సిగరెట్లు ఉన్నాయని మరొకరు ఇలా ప్రచారం చేస్తూనే ఉన్నారు.

ఈ లోపు పోలీసులు బంజారాహిల్స్ పోలీసులపై వేటు వేశారు. ఈ రేవ్ పార్టీపై దాడి చేసిన స్పెషల్ పార్టీ పోలీసు సీఐకే ఆ పోలీస్ స్టేషన్ పోస్టింగ్ ఇచ్చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు తరహాలో ఇక్కడ కూడా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది. డ్రగ్స్ దొరికితే పోలీసులు అందరికీ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేయించడం విధిగా చేయాల్సిన పని . అలాటిందేం చేయలేదు.

మరో వైపు మీడియాకు ఎప్పటికప్పుడు లీకులు ఇచ్చి విస్తృతంగా ప్రచారం చేసి కొంత మందిని టార్గెట్ చేయడంలో పోలీసులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరికి నటి హేమ పేరు కూడా ఉందని ప్రచారం చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి తనదైన స్టైల్లో నటించేశారు. ఆ పార్టీలో ఉన్న వారి పేర్లు బయటకు వచ్చినా చాలా మంది ప్రముఖుల ప్రే్లను జాబితాలో చూపించలేదు. మత్తంగా ఇదిగో పార్టీ అంటే.. అదిగో డ్రగ్స్ అనడం కామన్‌గా అయిపోయింది. ఇలాంటివి పట్టుబడినప్పుడు మీడియాలో హైలెట్ అవడం.. తర్వాత సైలెంట్ అవడం కామన్ అయిపోయింది. పట్టుబడిన వారు హై రెంజ్ పిల్లలు కాబట్టి.. మీడియాకు సెన్సేషనలిజం అయింది. కానీ వాస్తవం ఏమిటో పోలీసులే చెప్పాల్సింది. అయితే్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వారి పేర్లు కూడా జాబితాలో కనిపించకపోవడంతో వారి చిత్తశుద్ధిపైనా చాలా మందికి అనుమానం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close