ఓటీటీలకే సెన్సార్ లేదని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతూంట.. మరికొంత మంది ఏకంగా అడల్ట్ కంటెంట్ తో ఓటీటీలనే ప్రారంభించేశారు. ఇలాంటివి పెరిగిపోవడం, వాటిలో ఘోరమైన దృశ్యాలు ప్రసారమవుతున్నాయని ఆరోపణలు రావడంతో పూర్తి నివేదికలు తెప్పిచుకున్న కేంద్రం వాటిని బ్యాన్ చేస్తూ నిషేధం విధించింది. మొత్తం 23 అడల్ట్ కంటెంట్ ఓటీటీలను బ్యాన్ చేశారు.
ఇందులో ఉల్లు, అల్ట్ బాలాజీ ఓటీటీలు కూడా ఉన్నాయి. అల్ బాలాజీ యాప్ ఏక్తాకపూర్ నేతృత్వంలో నడుస్తోంది. మామూలు షోలకు డోస్ పెంచి కంటెంట్ ఇచ్చేవారు. ఈ యాప్ బాగా వర్కవుట్ అవుతుందని ఇతరులు ప్రారంభించారు. ఉల్లు యూప్ ఇటీవలి కాలంలో ఘోరమైన రియాలిటీ షోలు కూడా నిర్వహిస్తూ వైరల్ అయింది. మొత్తం 23యాప్‌లు అడల్ట్ అనే పేరుతో.. పోర్నోగ్రఫీని ప్రమోట్ చేస్తున్నాయని.. షోలను ప్రసారం చేస్తున్నాయని నిర్ణయించుకుని వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
Google Play Store, Apple App Store నుంచి కూడా ఈ యాప్స్ తొలగించాలని ఆదేశించారు. OTT, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలు భారతీయ చట్టాలు/నిబంధనలు అనుసరించకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అధికారికంగా ఈ యాప్స్ లభించకపోవచ్చు కానీ.. అందులోని కంటెంట్ ను రకరకాలుగా సర్క్యులేట్ చేసుకుంటారు నెటిజన్లు. వాటిని కేంద్రం ఆపగలుగుతుందా లేదా అన్నది సందేహమే.