ఏపీ పోలీసుల తీరుపై కేంద్రం దర్యాప్తు..!?

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు చట్టాన్ని, రాజ్యాంగాన్ని పాటించకుండా ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారని వస్తున్న విమర్శల నేపధ్యంలో కేంద్రం.. అసాధారణ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా…తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, పోలీసులను అడ్డం పెట్టుకుని… టీడీపీ నేతల్ని వేధిస్తున్న తీరుపై… ఆ పార్టీకి చెందిన నేతలు.. కిషన్ రెడ్డిని హైదాబాద్‌లో కలిసి వినతి పత్రం అందించారు. ఆ వినతి పత్రంతో పాటు.. మూడు నెలల కాలంలో జరిగిన వ్యవహారాలు… కోడెలపై పెట్టిన కేసులు.. వాటి విషయంలో… జగన్ మీడియా వ్యవహరించిన తీరు.. ఇలా ప్రతీ అంశాన్ని ఆధారాలతో సహా కిషన్ రెడ్డికి ఇచ్చారు.

టీడీపీ నేతల ఫిర్యాదులపై…తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఏపీ పోలీసుల తీరుపై.. తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అలాగే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా… ఫిర్యాదులు అందాయన్నారు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి… కేంద్రంతో పూర్తిగా దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. ఏ ప్రభుత్వం అయినా చట్టాలు చేతిలోకి తీసుకోకూడదని.. ఈ విషయంపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో సమగ్ర నివేదిక తెప్పిచుకుంటామని స్పష్టం చేశారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత అవసరమైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానన్నారు.

తెలుగు రాష్ట్రాల బాధ్యతలను.. తనకు అప్పగించాలని కిషన్ రెడ్డి పదవి చేపట్టిన మొదట్లోనే చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. కోడెల ఆత్మహత్యపై.. బీజేపీ నేతలందరూ… ప్రభుత్వ వేధింపుల వల్లే అనే స్టాండ్‌కు పరిమితమయ్యారు. మరో వాదన వినిపించడం లేదు. పైగా పోలీసుల పనితీరుపై.. బీజేపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్నాడులో బహిరంగసభ ఏర్పాటు చేసుకుంటే.,.. దాన్ని కూడా నిర్వహించకుండా… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం … ఆ పార్టీ హైకమాండ్‌కు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. అందుకే పోలీసుల పనితీరుపై.. విచారణ జరిపించడం లాంటి కీలక నిర్ణయాల గురించి కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close