“అప్పుల”ను నిజంగానే కేంద్రం నియంత్రిస్తే జగన్‌ సర్కార్‌కు దారేది !?

రాష్ట్రపతి ఎన్నికలు అలా ముగియగానే ఇలా కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి కొన్ని షాకులు తగిలాయి. ఇతర అంశాల్లో కన్నా ఇవి ఆర్థిక పరమైన విషయాల కారణంగానే హైలెట్ అవుతున్నాయి. కేంద్ర విదేశాంగ మంత్రి ఏపీలో శ్రీలంకలు అంటూ ప్రజెంటేషన్ ఇచ్చి.. ఏపీ ని ప్రముఖంగా ప్రస్తావించారు. జాగ్రత్త పడాల్సిదేనన్నారు. ఆ తర్వాత ఏపీకి అప్పులిస్తున్న బ్యాంకులపై ఆర్బీఐ సీరియస్ అయింది. ఇది మామూలు విషయం కాదు. ఎవరైనా ఏపీకి అప్పులివ్వాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి బ్యాంకులకు నోటీసుల ద్వారా ఆర్బీఐ కల్పించింది.

ఏపీ తీసుకుంటున్న అప్పులు సక్రమమా… అక్రమమా.. ఎక్కువా.. తక్కువా అన్న వాటిని పక్కన పెడితే.. ఇంత కాలం పెద్దగా పట్టించుకోని కేంద్రం ఇప్పుడు కాస్త సీరియస్‌గా తీుకుందా అన్న అనుమానం తాజా పరిణామాల ద్వారా వస్తోంది. ఇప్పటి వరకూ అడిగినన్ని అప్పులు ఇస్తూ వస్తున్నారు. అలాగే బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవడానికి తమ లాబీయింగ్ ద్వారా ఎంత చేయగలిగితే అంత చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే కేంద్రం రాజకీయ అంశాల్లో ఏమో కానీ ఆర్థిక పరమైన విషయాల్లో కఠినంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.

అదే జరిగితే వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక పరమైన కష్టాలు చుట్టుముడతాయి. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన అప్పుల పరిమితిని దాదాపుగా ఈ నెలలో దాటేస్తారు. అదనపు అప్పుల కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కానీ శ్రీలంక అనుభవాలు భయ పెడుతున్న సమయంలో కేంద్రం ఇక విచ్చలవిడిగా అప్పులకు చాన్సివ్వదని భావిస్తున్నారు. అదే సమయంలో ఉచితాలపై ఇటీవల మోదీ వ్యాఖ్యలు కూడా కొంత మంది ఉదహరిస్తున్నారు. నగదు బదిలీ పథకాల్లో ఏపీ ముందు ఉంది. ఇలాంటి వాటిని మోదీ సహించరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బీజేపీ అప్పులు అందకుండా చేయడం కాదు కనీసం సహకారం అందివ్వకపోయినా ఏపీ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close