ఇంగ్లిష్ మీడియంపై కేంద్రం “కౌంటర్”..!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుమీడియం లేకుండా ఎత్తేసి ఒక్క ఇంగ్లిష్ మీడియమే పెట్టాలన్న పట్టదలతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కేంద్రం కౌంటర్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో వేసిన కౌంటర్‌తో.. జగన్ నిర్ణయం అమలు చేయడం చట్ట విరుద్ధమని తేల్చేసింది. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో సాగాలన్నదే తమ విధానమని కేంద్రం స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంగ్లిష్ మీడియాన్ని నిర్బంధం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కేంద్ర పాఠశాల విద్యాశాఖ గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ప్రాథమిక విద్యాబోధన తప్పనిసరిగా పిల్లల మాతృభాషలోనే సాగాలని.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 350ఎ ప్రకారం భాషాపరంగా మైనార్టీ వర్గాల పిల్లలకు సైతం ప్రాథమిక విద్యను వారి మాతృభాషలోనే బోధించాల్సి ఉందని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అందుకు అనువైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది. 2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 29 (ఎఫ్‌) కూడా సాధ్యమైనంత మేరకు విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని చెబుతోందని అఫిడవిట్‌లో తెలిపింది. నూతన విద్యావిధానం కూడా ఇదే చెబుతున్నట్లు వివరించింది.

పిల్లలు తమ మాతృభాషల్లో అయితేనే క్లిష్టమైన అంశాలను సులభంగా నేర్చుకోగలరు. కనీసం ఐదో తరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన ఉండాలి. దీన్ని 8వ తరగతి, అంతకుమించి కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. మరో వైపు తెలుగు భాషా పండితులు కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌తో ఏపీ సర్కార్ కు మరో విషయంలో కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్న చర్చ న్యాయవాద వర్గాల్లో ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close