అశ్లీల వెబ్ సైట్లపై కేంద్రం నిషేధం అమలు

ఇంటర్నెట్ లో వేలాదిగా పుట్టుకొస్తున్నన్న అశ్లీల వెబ్ సైట్ల కారణంగా సమాజంపై పడుతున్న దుష్ప్రభావాలను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్ మాద్యమం ద్వారా అశ్లీల వెబ్ సైట్ల ప్రసారాన్ని నిన్నటి నుండి నిలిపి వేసింది. ఇంతరకు సుమారు 5,000 అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేయగా త్వరలో మరిన్ని నిలిపివేసేందుకు చర్యలు చేపడుతోంది. బీ.యస్.యన్.,యల్.వోడా ఫోన్, హాత్ వే వంటి 8 సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ వెబ్ సైట్లు ప్రసారం కాకుండా నిలిపివేయించింది. దేశంలో మిగిలిన సర్వీస్ ప్రొవైడర్లను కూడా ఈ అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. కానీ అశ్లీల వెబ్ సైట్ల నిషేధం అంటే వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని ఇంతకు ముందు సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కనుక త్వరలోనే దీనిపై ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేసినా ఆశ్చర్యం లేదు.

ఇటువంటి అంశాలపై స్పందించే అలవాటున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై తక్షణమే స్పందించారు. కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. అశ్లీల వెబ్ సైట్లను నిషేదించడం వలన సమాజంలో నేరాలు తగ్గవని కనుక నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. చేయవద్దన్న పనినే చేయడం మనిషి నిజమని కనుక దీనివలన ప్రజలలో వాటిని చూడాలని మరింత ఉత్సుకత పెరుగుతుందని అయన అభిప్రాయపడ్డారు. కనుక కేంద్రప్రభుత్వం నేర నియంత్రణపైనే దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.

రాజుగారు తలచుకొంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లుగా కేంద్రం తలుచుకోగానే రాత్రికి రాత్రే ఏకంగా 5,000 అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేయించగలిగింది. కానీ అదే చొరవ, చిత్తశుద్ది సినీ పరిశ్రమని దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని అణచివేయడంలో కూడా చూపిస్తే బాగుండును కదా అని సినీ పరిశ్రమలో వారు అనుకొంటున్నారు. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే కొన్ని పైరసీ సంస్థలు ఆ సినిమా సీడీలను మార్కెట్ లోకి విడుదల చేస్తుంటే, అనేక వెబ్ సైట్లు ఆ సినిమా విడుదలయిన మొదటి షో తరువాత నుండి వాటిని తమ వెబ్ సైట్లలో పెట్టి ప్రజలు చూసేందుకు మరికొన్ని వెబ్ సైట్లయితే వాటిని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొనేందుకు కూడా వీలు కల్పిస్తున్నాయి. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఏకంగా 5,000 అశ్లీల వెబ్ సైట్లను ఒక్కరోజులో నిలిపివేయగలిగిన కేంద్రప్రభుత్వం ఈ పైరసీ వెబ్ సైట్లను, సీడీలను సృష్టిస్తున్న పైరసీ సంస్థలపై ఉక్కు పాదం మోపినట్లయితే, వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ సినీ పరిశ్రమను ఆదుకొన్నట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close