హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇవాళ స్పష్టం చేసేసింది. ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వబోమని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి ఎటువంటి విధానమూ లేదని కేంద్ర మంత్రి ఇంద్రజిత్‌సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. బీహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇటీవల ప్రకటించింది స్పెషల్ ప్యాకేజి అని స్పెషల్ స్టేటస్ కాదని మంత్రి వివరించారు. మంత్రి ఈ ప్రకటన చేస్తున్నపుడుకూడా సభలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నోరు మెదపకపోవటం విశేషం. ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ప్రత్యేకహోదాకోసం అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో నిలదీసిన సంగతి తెలిసిందే.