పోలవరం “బాధ్యత” నుంచి వైదొలుగుతున్న కేంద్రం..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో వేస్తున్న ప్రశ్నల ద్వారా.. కేంద్రం.. మెల్లగా.. ఒక్కొక్కటిగా… తన బరువును దించుకుంటోంది. ఆయన వేస్తున్న ప్రశ్నలకు.. తమ విధానం ఇదే అన్నట్లుగా జవాబులు ఇస్తోంది. వాటిపై.. వైసీపీ సభ్యులు మాట్లాడలేకపోతున్నారు. ఖండించలేకపోతున్నారు. వైసీపీ సభ్యుల… నిరాసక్తతను గమనించిన కేంద్రం… విభజన హామీల విషయంలో… అంత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. దానికి.. పోలవరంపై.. కేంద్రం చెప్పిన సమాధానమే సాక్ష్యం.

90 శాతం ఖర్చు భరించడంపై కొత్త మాటలు..!

విభజన చట్టం ప్రకారం… పోలవరం ప్రాజెక్ట్ .. జాతీయ ప్రాజెక్టు. నిబంధనల ప్రకారం… జాతీయ ప్రాజెక్ట్ అంటే.. 90 శాతం ఖర్చు కేంద్రం భరించాలి. పది శాతం రాష్ట్రం పెట్టుకోవాలి. అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నందున… ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో.. ఆ పది శాతం ఖర్చు కూడా కేంద్రమే భరించేలా అప్పటి సర్కార్ ఒప్పించింది. అంటే.. మొత్తం వంద శాతం పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రానిదే. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కొన్ని వందల సార్లు చెప్పారు. కానీ.. ఇప్పుడు.. వంద శాతం గురించి కాదు.. 90 శాతం గురించి కూడా… వేరే మాటలు చెబుతున్నారు. 90 శాతం ఖర్చు భరించాలని.. ఆర్థిక శాఖ చెప్పలేదంటూ… కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం… కలకలం రేపుతోంది. ఇలా చెప్పాలంటే.. కచ్చితంగా కేంద్రానికి రెండో ఉద్దేశాలున్నాయని అనుకోవడమేనంటున్నారు.

రూ. 35వేల కోట్ల భారం రాష్ట్రంపై పడుతోందా..?

ప్రాజెక్ట్ సహాయ, పునరావాస బాధ్యత.. రాష్ట్ర ప్రభుత్వానిదేనని.. విజయసాయిరెడ్డి.. కేంద్రమంత్రితో చెప్పించారు. కానీ.. దీనిపై.. పార్లమెంట్‌లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి సాగునీటి ప్రాజెక్ట్ అంటే.. అందులో మొట్టమొదటిగా వచ్చే అంశం భూసేకరణ. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ పరిహారం ఇచ్చి ఖాళీ చేయించాలి. దీన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంటారు. ఇదంతా ప్రాజెక్టులో భాగం. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు భరిస్తామని చెబుతున్న కేంద్రం.. ఈ ఆర్ అండ్ ఆర్ బాధ్యత మాత్రం తమది కాదంటోంది. గత ఏపీ సర్కార్ దీనిపై తీవ్రంగా పోరాడింది. అందుకే.. నేరుగా ప్రకటన చేయలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి.. తమకేం సంబంధం లేదని మొహం మీదే చెబుతోంది. దీంతో పోలవర సహాయ, పునరావాసానికి అయ్యే రూ. 35వేల కోట్ల రాష్ట్రానికి భారంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

22 మంది ఎంపీలు నోరు తెరవరా..?

విభజన హామీలపై ఒక్కొక్క అంశంపై..కేంద్రం పుల్లవిరుపుగా వ్యవహరిస్తున్నా.. ఒక్కరంటే.. ఒక్క వైసీపీ ఎంపీ కూడా… మాట్లాడటం లేదు. పార్లమెంట్లో విభజన సమస్యల గురించి .. ఏపీకి రావాల్సిన నిధులు.. ఇతర అంశాల గురించి.. ఒక్కరంటే.. ఒక్కరూ మాట్లాడలేదు. మరో వైపు.. విజయసాయిరెడ్డి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ… బీజేపీ నుంచి ఏమీ రాదనే… సమాధానం ఇప్పిస్తున్నారు. దాంతో.. ఇది మొత్తం ఓ గూడు పుఠాణి వ్యవహారంలా సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే రాజకీయం నడుస్తోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close