ఢిల్లీలో శారదాపీఠం పేరుతో ఆ ఆశ్రమం పెట్టుకుని ఆ ఆశ్రమం పేరుతో ఓ కాలేజీ పెట్టి అందులో పేద విద్యార్థులను చేర్చుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న చైతన్యానంద అనే స్వామిజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పదిహేడు మంది విద్యార్థినులు ఫిర్యాదులు చేశారు. విదేశాలకు తీసుకెళ్తానని.. డబ్బులిస్తానని ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.
ఆయనకు ఆశ్రమంలోని ఇతరులు సహకరించేవారు. ఫిర్యాదు రావడంతో అధికారులు అక్కడి విద్యార్థినుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. మొత్తం ముఫ్పై మందిని ప్రశ్నిస్తే పదిహేడు మంది తాము లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు. దాంతో కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేస్తారన్న భయంతో చైతన్యానంద పరారరయ్యారు. ఆయన ఆగ్రాలోని ఓ హోటల్ లో దాక్కున్నట్లుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.
శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శారదా పీఠం చైతన్యానందతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఏపీలోని శారదాపీఠం పేరుతో స్వరూపానంద ఓ ఆశ్రమం పెట్టారు. అయితే అసలు శారదాపీఠానికి స్వరూపానంద పీఠానికి సంబంధం లేదు. అది ఆయన సొంతంగా పెట్టుకుని నడుపుకుంటున్నారు.