చైతూకి టెస్టింగ్ టైమ్

నాగ్ చైతన్య..అక్కినేని వారసత్వం పుచ్చుకుని, హీరోగా నిలదొక్కుకోవడానికి కిందా మీదా స్ట్రగుల్ అవుతున్న హీరో. చేసిన సినిమాల్లో సగం హిట్ లు, సగం ఫ్లాడపులుగా ఖాతాలో వున్న చైతూ ఇటీవల వరుస ఫ్లాపులతో బాధపడుతున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు ముందు ఒకటి తరువాత నాలుగు ఫ్లాపులు చైతూ ఖాతాలో వున్నాయి. ఇప్పుడు చైతూను ఆదుకోవడం కోసం సమంత రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న మజిలీ సినిమా విజయం సాధించాల్సిన అవసరం చైతన్యకు చాలా వుంది.

దీని తరువాత వెంకీ మామ ఒక్కటే ప్రస్తుతానికి చైతన్య ఖాతాలో వుంది. చైతన్య ఫ్లాపుల్లో ఎక్కువగా మాస్ సినిమాలే వున్నాయి. అందుకే తనకు అచ్చివచ్చిన ఫ్యామిలీ, లవ్ టచ్ వున్న క్లాస్ సినిమాను ట్రై చేస్తున్నాడు ఈసారి. ఈ సినిమా మీద మొదటి నుంచి మాంచి బజ్ వుంటూ వచ్చింది. కానీ ఎప్పడయితే ట్రయిలర్ బయటకు వచ్చిందో, మరీ టూ క్లాస్ సినిమా అవుతుందేమో అన్న టెన్షన్ అభిమానుల్లో, అదే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంత ఎమోషనల్ సినిమా అంటే చైతూ ఎలా చేస్తాడో అన్నది మరో టెన్షన్.

ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో మజిలీ విడుదలవుతోంది. దీనికి మరోసమస్య ఎలక్షన్ల కీలక సమయంలో వస్తుండడం అన్నది. ఈ సమస్యలు అన్నీ అధిగమించి మజిలీ సినిమా విజయం సాధించాలి. ఇది హిట్ అయితేనే చైతూ కెరీర్ మరింత ముందుకు సాగుతుంది. వెంకీ మామ తరువాత మరో సినిమా పట్టాలు ఎక్కుతుంది. లేదూ అంటే ఒడిదుడుకులలో పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐపీఎల్ స్టోరీస్‌: విరాట్ కి ఏమైంది?

విరాట్ కోహ్లీ.. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా, ఫార్మెట్ ఏదైనా - బౌల‌ర్ల‌పై భీక‌రంగా విరుచుకుపోవ‌డ‌మే త‌న‌కు తెలుసు. ఐపీఎల్ అంటే.. మ‌రింత చెల‌రేగిపోతాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు...

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

HOT NEWS

[X] Close
[X] Close