చైతూ – స‌మంత మ‌రోసారి!

తెర‌పైనే కాదు, నిజ జీవితంలోనూ సూప‌ర్ హిట్ జోడీ అనిపించుకున్నారు నాగ‌చైత‌న్య – స‌మంత‌. పెళ్ల‌య్యాక ఇద్ద‌రూ క‌లిసి చేసిన తొలి సినిమా `మ‌జిలీ` మంచి విజ‌యాన్ని అంకుంది. అటు చైలోనూ, ఇటు స‌మంత‌లోనూ మెచ్యూరిటీ లెవ‌ల్స్ క‌నిపించాయి. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ జోడీ క‌ట్ట‌బోతున్న‌ట్టు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

నాగ‌చైత‌న్య కోసం విక్ర‌మ్ కె.కుమార్ ఓ స్క్రిప్టు రెడీ చేశాడు. అదే.. `థ్యాంక్యూ`. ఈ క‌థ చైతూకి బాగా న‌చ్చింది. వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ప్ర‌స్తుతం స్క్రిప్టు ని ఫైన్ ట్యూన్ చేస్తున్నాడు విక్ర‌మ్. క‌థానాయిక‌గా స‌మంత పేరు ప‌రిశీలిస్తున్నాడ‌ట‌. స‌మంత దాదాపుగా ఖాయం అన్న‌మాట‌లు వినిపిస్తున్నాయి. విక్ర‌మ్ కూడా.. `నాకు స‌మంతే కావాలి` అని ప‌ట్టుబ‌డుతున్నాట‌. విక్ర‌మ్ తీసిన `మ‌నం`లోనూ స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. `24`లోనూ త‌నే నాయిక‌. ఆ సెంటిమెంట్ తోనే విక్ర‌మ్‌. సమంత వైపు మొగ్గు చూపిస్తున్నాడ‌ట‌. పెళ్ల‌య్యాక చైతో క‌లిసి న‌టించ‌డానికి స‌మంత బాగా ఆలోచిస్తోంది. ఆషామాషీ క‌థ‌ల్ని అస్స‌లు ఒప్పుకోవ‌డం లేదు. `మ‌జిలీ`లో న‌టించ‌డానికి కూడా త‌ట‌ప‌టాయించింది. అయితే ఈసారి విక్ర‌మ్ కుమార్ కి `ఎస్‌` చెప్పేసింద‌ని స‌మాచారం.సో.. ఈ హిట్ కాంబో మ‌రోసారి అల‌రించ‌డానికి రెడీ అవుతోంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిజెపి జనసేన పొత్తు విచ్ఛిన్న యత్నం? జీవీఎల్ కూడా వైకాపా మనిషేనా?

పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక వర్గం మనిషి గా బయటికి మెలుగుతూ, అంతర్గతంగా వేరే వర్గానికి మద్దతు ఇచ్చే పాత్రలను అప్పుడప్పుడు చూస్తూవుంటాం. అయితే నిజ జీవితంలోని రాజకీయాలలో, పొలిటికల్ థ్రిల్లర్ సినిమా...

వైసీపీ ఎంపీ భూముల్ని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కినెటా పవర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. నెల్లూరు జిల్లా చిల్లకూర్ మం. తమ్మినపట్నం, మోమిడి గ్రామాల్లో.. ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు...

గ్రేటర్ ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్స్.. !

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వివాదాలు సృష్టించడానికేనన్నట్లుగా చెలరేగిపోతున్నారు. తాజా ఆయన నోటి వెంట సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. అది...

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

Sravan Babu, Freelance Journalist బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు...

HOT NEWS

[X] Close
[X] Close